News


తగ్గిన చమురు

Friday 13th September 2019
Markets_main1568350025.png-28348

యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుధ్దం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు తగ్గుతుండడంతో శుక్రవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 17 సెంట్లు లేదా 0.3 శాతం క్షీణించి బ్యారెల్‌ 60.21 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్ల్యుటీఐ క్రూడ్‌ 14 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి బ్యారెల్‌ 54.95 డాలర్లకు చేరుకుంది. 
  ‘యుఎస్‌, చైనా మధ్య వివాదం ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) చమురు ఉత్పత్తిని మరింత తగ్గిస్తుండడం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనంలో మరింతగా చిక్కుకుపోతుందనే సంకేతాలనిస్తుంది’ అని విశ్లేషకులు తెలిపారు. కాగా రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు, యుఎస్-చైనా వాణిజ్య మరింత ముదిరే అవకాశం ఉందని లేదా ఇదే విధంగా కొనసాగుతుందని అంచనా వేయడంతో చమురు మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలహీనపడింది. ఈ పోల్‌లో 60 మందికి పైగా ఆర్థికవేత్తలలో, దాదాపు 80 శాతం మంది యుఎస్-చైనా వాణిజ్య సంబంధాలు మరింత దిగజారిపోతాయని లేదా వచ్చే ఏడాది చివరినాటికి అదే విధంగా ఉంటాయని అభిప్రాయపడడం గమనార్హం. 
   యుఎస్‌ ఆర్థిక మాంద్యం వచ్చే 12 నెలలో రావడానికి 30 శాతం అవకాశం ఉందని, వచ్చే రెండేళ్లలో రాడానికి 45 శాతం అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  అధికంగా చమురును ఉత్పత్తి చేసే దేశాలయిన ఇరాక్, నైజీరియాను తమ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని ఒపెక్‌ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం, ఈ ట్రేడ్‌వార్‌ అంశం వలన మరుగున పడిపోయింది. 
    ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ఏర్పాటు చేసిన మార్కెట్-పర్యవేక్షణ కమిటీ, ఒపెక్ ప్లస్‌ దేశాలు గురువారం అబుదాబిలో సమావేశం అయ్యాయి. ఈ సమావేశం, డిసెంబర్‌లో వియన్నాలో జరగనున్న పాలసీ చర్చలకు ముందు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుం‍ది. ఇరాన్‌, వెనిజులా ఎగుమతులపై ఆంక్షలుండడంతో పాటు ఒపెక్, ఒపెక్‌ ‍ప్లస్‌ దేశాలు రోజుకు 12 లక్షల బారెల్స్ (బీపీడీ)ఉత్పత్తి తగ్గింపును కొనసాగిస్తుండడంతో చమురు ధరలకు కొంత మద్ధతు లభిస్తోంది. కానీ ఇరాక్, నైజీరియా వంటి కొన్ని దేశాలు తమ కోటా కంటే అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. You may be interested

70.96 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 13th September 2019

తాజాగా విదేశి నిధుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, చమురు ధరలు పడిపోవడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌ కొంత సరళతరం అవ్వడం, చైనా కరెన్సీ బలపడడం వంటి కారణాల వలన రూపీ డాలర్‌ మారకంలో గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. రూపీ... డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 18 పైసలు బలపడి 70.96 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో  52 పైసలు బలపడి

ఆటో మందగమనానికి ఓలా, ఊబర్‌ కాదు కారణం

Friday 13th September 2019

పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సిన అవసరం ఇప్పటికీ కారు కొనాలన్న ఆకాంక్ష ఉంది మారుతి సుజుకీ శ్రీవాస్తవ అభిప్రాయం గువహటి: యువత (మిలీనియల్స్‌/20-40 మధ్యనున్నవారు) కార్లు కొనడానికి బదులు ఓలా, ఊబర్‌ వంటి ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే ఆటోమొబైల్‌ వాహన విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాదనను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి అంగీకరించలేదు. వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం

Most from this category