News


డిమాండ్‌ భయాలు..తగ్గిన చమురు

Wednesday 7th August 2019
Markets_main1565151603.png-27588

lయుఎస్‌ చమురు నిల్వలు పడిపోయినప్పటికి రెండు పెద్ద చమురు వినియోగ దేశాలైన యుఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ, చమురు డిమాండ్‌ ఆందోళనలను పెంచుతోంది. ఫలితంగా బుధవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.41 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.70 డాలర్లకు చేరుకుంది. కాగా ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ గత ఏడు నెలల కనిష్ఠం వద్ద ట్రేడవుతుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ధర కూడా 0.37 శాతం పడిపోయి బ్యారెల్‌కు 53.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య వివాదం ప్రభావంతో చమురు ధరలు ఒత్తిడిలో ఉన్నాయని అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్ ఒక నోట్‌లో పేర్కొంది. 
  గత వారం ట్రంప్‌ మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై సెప్టెంబరు 1 నుంచి 10 శాతం సుంకం విధిస్తానని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రెంట్‌ క్రూడ్‌ 9 శాతం పైగా నష్టపోయింది. వీటితో పాటు అరేబియా గల్ఫ్‌లో సముద్ర ట్రాఫిక్ స్వేచ్ఛకు అడ్డంకిగా ఉన్న అంశాలపై  సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్, యుఎస్ ఇంధన కార్యదర్శి రిక్ పెర్రీ మంగళవారం ఆందోళనను వ్యక్తం చేశారు. ట్యాంకర్లు, యుఎస్ డ్రోన్‌లపై దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పడిపోవడంతో చమురు ధరలకు కొంత​మద్ధతు లభించనుంది. ఆగస్టు 2 తో ముగిసిన వారంలో యుఎస్ క్రూడ్‌ నిల్వలు 28 లక్షల బ్యారెల్‌ తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేయగా, అది 34 లక్షలు తగ్గి 4,396 లక్షల బ్యారెళ్లకు చేరుకుంది. దీనిపై ప్రభుత్వ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఐ) నుంచి అధికారిక డేటా బుధవారం వెలువడనుంది.



You may be interested

పసిడి @ 1500డాలర్లు

Wednesday 7th August 2019

ఆరేళ్ల సుధీర్ఘకాలం అనంతరం ప్రపంచమార్కెట్లోని పసడి ధరలు 1500డాలర్ల స్థాయిని అందుకుంది. ఆసియాలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 18డాలర్లు ర్యాలీ చేసి 1,502.25డాలర్ల స్థాయిని అందుకుంది. అమెరికా చైనాల మధ్య రోజురోజూకు తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అంతర్జాయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, పలు ప్రపంచదేశాల రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై మెతక వైఖరి తదితర అంశాలు పసిడి ధర 1500డాలర్ల అందుకునేందుకు తోడ్పాటునిచ్చాయి.

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 7th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఏవియేషన్‌ ఫ్యూయల్‌ విక్రయంతో పాటు, దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన బీపీ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ వాటా 51శాతం గానూ, బీపీ లిమిటెడ్‌ వాటా 49శాతంగానూ ఉంటుంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.25వేల కోట్లను, రుణాల ద్వారా రూ.1000 కోట్లను సమీకరించేందుకు

Most from this category