News


పెరిగిన క్రూడ్‌

Monday 8th July 2019
Markets_main1562558401.png-26876

అమెరికా వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాలు పెరిగాయనే సమాచారం అధికారికంగా వెలువడడంతో సోమవారం(జులై 8) ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 0.2 శాతం పెరిగి 64.33 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.65 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా- చైనాల వాణిజ్య యుధ్ద భయాలు తగ్గడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణం. ‘అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు గత జూన్‌ నెలలో పెరిగింది. ఇది గత ఐదు నెలల కంటే అధికం కావడం గమనర్హం. జూన్‌లో 224,000 కొత్తగా ఉద్యోగులు చేరారు’ అని వాన్‌గర్డ్‌ మార్కెట్‌ మానేజింగ్‌ పార్టనర్‌ స్టీపెన్‌ ఇన్స్‌ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా గత వారంలో బ్రెంట్‌ క్రూడ్‌ 3 శాతం మేర, డబ్యూటీఐ క్రూడ్‌ 1.5 శాతం మేర నష్టపోయిన విషయం తెలిసిందే.  



You may be interested

68.55 వద్ద రూపీ ప్రారంభం​

Monday 8th July 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం ట్రేడింగ్‌లో(జులై 8) 5పైసలు బలహీనపడి 68.55 వద్ద ప్రారంభమైంది. బడ్జెట్‌ నేపథ్యంలో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 39 పైసలు బలపడి 68. 50 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఉదయం 9.35 సమయంలో రూపీ డాలర్‌ మారకంలో 0.19 శాతం బలపడి 68.54గా ఉంది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  68.70 -69.35 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 8th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 39,150 సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల క్షీణతతో 11,710పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ఆసియా సూచీల పతనం.. అమెరికా జాబ్స్‌ డేటా గత శుక్రవారం పాజిటివ్‌గా వెలువడటంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన

Most from this category