News


కొనసాగుతున్న చమురు ధరల పెరుగుదల..

Wednesday 19th June 2019
Markets_main1560918519.png-26398

గత సెషన్‌లో కనిపించిన చమురు ధరల పెరుగుదల బుధవారం ట్రేడింగ్‌లో కూడా కొనసాగుతుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.6శాతం పెరిగి బ్యారెల్‌ 62.48డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.8శాతం పెరిగి బ్యారెల్‌ 54.34డాలర్ల వద్ద  ట్రేడవుతున్నాయి. ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి కొనసాగుతుండడం, యూఎస్‌ -చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతాయనే నేపథ్యంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. జపాన్‌ ఒసాకాలో జరగనున్న జీ20 సమావేశాల్లో జిన్‌పింగ్‌తో కలవడానికి సిధ్ధంగా ఉన్నామని మంగళవారం ట్రంప్‌ అనడంతో ఇరుదేశాల మధ్యల వాణిజ్య యుద్దం తగ్గుముఖం పడుతుందనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు ఉన్నారు. దీంతో పాటు ఇరాన్‌-అమెరికా దేశాల మధ్య ప్రస్తుతం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కూడా ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఆయిల్‌ ట్యాంకర్లపై గత వారం జరిగిన దాడికి ఇరానే కారణమని అమెరికా ఆరోపించడం, ఇరాన్‌ దానిని ఖండిస్తుండడం తెలిసిందే. అంతే కాకుండా ఒపెక్‌ దేశాల సమావేశం వచ్చే వారంలో ఉండడంతో మదుపర్లు దీనిపై దృష్ఠి పెట్టనున్నారు. నాన్‌ ఒపెక్‌ దేశాలైనా రష్యాలో చమురు ఉత్పత్తి తగ్గుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆయిల్‌ ధరలు పెరిగాయి.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 19th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కెనరా బ్యాంక్‌:- కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో  మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  హెచ్‌సీఎల్‌ :- క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఏడాది కాలంలో పాటు సాంకేతిక సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదానీ పోర్ట్స్‌:-  ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇష్యూ రేటింగ్‌ను బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో స్టేబుల్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది. జైన్‌ ఇరిగేషన్‌:- ధీర్ఘకాలిక ఇష్యూ రేటింగ్‌ను ‘‘బిబిబి’’కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు ‘‘నెగిటివ్‌’’ అవుట్‌లుక్‌ను

స్వీయ తప్పిదాలే అనిల్‌ అంబాని కొంప ముంచాయా?!

Wednesday 19th June 2019

కొన్నేళ్ల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరవ స్థానం‍లో నిలిచిన అనిల్‌ అంబాని ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 2008లో 4200 కోట్లడాలర్లున్న అనీల్‌ సంపద, మంగళవారం క్లోజింగ్‌ అనంతరం వంద కోట్ల డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 77.30 కోట్ల డాలర్లుంటుందని అంచనా. విచ్చలవిడిగా రుణాలను సేకరించడం, లాభదాయకం కాని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడంతో ఆయన తీవ్ర నష్టాలను చూశారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ను విస్తరించడానికి

Most from this category