చమురు భారీ పతనం
By Sakshi

ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి కోత కాలపరిమితిని పొడిగించినప్పటికి అంతర్జాతీయంగా చమురు డిమాండ్ బలహీనంగా ఉండడం వలన గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో చమురు ధరలు ఏకంగా 4 శాతం మేర పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 64.8 డాలర్ల స్థాయి నుంచి 62 డాలర్ల స్థాయికి, డబ్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 58 డాలర్ల స్థాయి నుంచి 56 డాలర్ల స్థాయికి పడిపోయాయి. అయితే గత రాత్రి పతనం తర్వాత ఆసియా మార్కెట్లలో చమురు ధరల బుధవారం(జులై 3) ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరగడం గమనార్హం. సెప్టెంబర్ బ్రెంట్ క్రూడ్ ప్యూచర్ ధరలు 0.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.88 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్ ధరలు 0.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 56.62 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ధరలను స్థిరికరించేందుకు ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాలు మంగళవారం చమురు ఉత్పత్తి కోతను 2020 వరకు పెంచాయి. అంతేకాకుండా అమెరికా చమురు నిల్వలు గత వారం అంచనాల కంటే ఎక్కువగా పడిపోయాయని , ఇది 30 లక్షల బ్యారెల్‌గా అంచనా వేస్తే 50 లక్షల బ్యారెల్‌గా ఉందని అమెరికా పెట్రోలియం ఇనిస్టిట్యూట్ తెలిపింది. విమాన రంగంలో అమెరికా- ఈయూ మధ్య చెలరేగిన ఘర్షణ వాతవరణం పెట్టుబడిదారులను కలవరపెడుతోంది.
You may be interested
32 డాలర్లు పెరిగి పసిడి
Wednesday 3rd July 2019అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు బాండ్ ఈల్డ్స్ పతనంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఆగస్ట్ కాంటాక్టు పసిడి ఫ్యూచర్ ఔన్స్ పసిడి ధర ఏకంగా 32డాలర్లు లాభపడి 1,439.95 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది పసిడి ధరకి వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. అమెరికా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవర్రో ‘‘చైనాతో వాణిజ్య చర్చలు సరైన దిశలో
బుధవారం వార్తల్లోని షేర్లు
Wednesday 3rd July 2019వివిధ వార్తలకు సంబంధించిన బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు షాపర్స్ స్టాప్:- ఆదిత్య బిర్లా సన్ లైన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 2శాతం వాటాను కొనుగోలు చేసింది. బీహెచ్ఈఎల్:- కంపెనీ సీఎండీ నలిన్ సింఘాల్ నియామకం జరిగేంత వరకు ప్రస్తుతం డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న డి.బందోపాధ్యాయ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. కల్పతరు పవర్ ట్రాన్స్పోర్ట్స్:- శుభమ్ లాజిస్టిక్స్‌లో మిగిలిన 20శాతం వాటాను రూ.65కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో మొత్తం వాటాను సొంతం