News


తగ్గిన చమురు

Friday 26th July 2019
Markets_main1564114185.png-27323

యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయ మందగమనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని రాయిటర్ పోల్‌ పేర్కొనడంతో చమురు ధరలు శుక్రవారం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కానీ మధ్య ప్రాచ్య ఒత్తిళ్ల వలన ఈ నష్టాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.1 శాతం తగ్గి బ్యారెల్‌కు 55.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.3 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు  0.25 శాతం పెరిగాయి. అంతర్జాతీయ కీలక సెంట్రల్‌ బ్యాంకులు వడ్డి రేట్లను తగ్గించడం లేదా పాలసీలను తీసుకొస్తాయనే అంచనాలున్నప్పటికి అంతర్జాతీయ మందగమనం ఇంకా కొనసాగుతుందని  500 మందికి పైగా ఆర్థికవేత్తలతో రాయిటర్స్‌ చేసిన పోల్‌ తెలిపింది. ఈ ఆర్థిక వేత్తలు  యూఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌పై ఎక్కువ  ఆందోళనగా ఉండడం గమనర్హం.  



You may be interested

టాటా మోటర్స్‌..5 నెలల కనిష్ఠానికి

Friday 26th July 2019

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలను ప్రకటించడంతో, శుక్రవారం ఈ కంపెనీ షేరు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతేకాకుండా గత  సెషన్‌లో 4 శాతం నష్టపోయి రూ.144.30 వద్ద ముగిసింది. ఈ రోజు సెషన్‌లో మరో 3 శాతం నష్టంతో ఐదు నెలల కనిష్టస్థాయి రూ.138.10 వద్ద ప్రారంభమై తిరిగి కోలుకుంది. ఉదయం 9.47 సమయానికి టాటా

11250 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Friday 26th July 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నుడుమ శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు సాంకేతికంగా కీలకమైన 11250 స్థాయి దిగువన 5 పాయింట్ల నష్టంతో 11,247.45 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 37820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫోర్డ్‌ మోటర్స్‌ కంపెనీతో సహా పలు ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడం, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ నిన్న

Most from this category