రెండో రోజు తగ్గిన చమురు
By Sakshi

అమెరికా గల్ఫ్‌లో చమురు ఉత్పత్తి తిరిగి పుంజుకోవడంతో పాటు, చైనా జీడీపీ రేటు రెండవ క్వార్టర్లో నెమ్మదించడంతో వరుసగా మంగళవారం కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 66.38 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 59.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.4 శాతం, అమెరికా క్రూడ్ 1 శాతం నష్టపోయి ముగిశాయి. అమెరికా చమురు నిల్వలు అనుహ్యాంగా తగ్గడంతో పాటు మధ్యప్రాచ్య దేశాలలో ఒత్తిళ్ల వలన గత వారం ఈ రెండు కాంట్రాక్టుల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా గల్ఫ్‌లో హరికేన్ కారణంగా మూసివేసిన చమురు ఉత్పత్తిదారులలో 74 శాతం తిరిగి సోమవారం ప్రారంభించడంతో అధిక సరఫరా భయాలు క్రూడ్‌ను ముంచాయి. చైనా రెండవ త్రైమాసికంలో కేవలం 6.2 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది 27 ఏళ్లలో తక్కువ కావడం గమనర్హం. చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమయ్యే అవకాశాన్ని ఇది తెలియజేస్తోంది. చమురు మార్కెట్లు నష్టపోడానికి చైనా బలహీనమైన వినియోగ డేటా ఒక కారణమని వాన్గార్డ్ మార్కెట్స్ మేనేజింగ్ భాగస్వామి స్టీఫెన్ ఇన్నెస్ అన్నారు. దీంతో పాటు చైనాలో కొత్తగా రెండు పెద్ద శుద్ధి కర్మాగారాలు ప్రారంభమవ్వడంతో జూన్‌లో 130.7 లక్షల బ్యారెళ్ల బీపీడీలకు చైనా చమురు ఉత్పత్తి పెరిగింది. ఇది ముందు ఏడాది కన్నా 7.7 శాతం అధికం.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని యుఎస్ నియంత్రిత ప్రాంతాల్లో రోజుకు 1.3 మిలియన్ బారెల్స్ (బిపిడి) చమురు ఉత్పత్తి సోమవారం ఆఫ్‌లైన్‌లో ఉంది ఇది ఆదివారం కంటే 80,000 బారెల్స్ తక్కువ. తుఫాను గల్ఫ్ ఆఫ్ మెక్సికోను విడిచిపెట్టిన తరువాత పూర్తి ఉత్పత్తి తిరిగి ప్రారంభించడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
You may be interested
68.54 వద్ద ప్లాట్‌గా రూపీ
Tuesday 16th July 2019దేశియ ఎగుమతులు ఎనిమిది నెలల తర్వాత నెగిటివ్ జోన్లోకి పడిపోవడంతో రూపీ డాలర్ మారకంలో మంగళవారం(జులై 16) ట్రేడింగ్‌లో 68.54 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. జూన్ నెలలో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25.01 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో జూన్ నెలలో 9 శాతం దిగుమతులు తగ్గి 40.29 బిలియన్ డాలర్లగా ఉంది. వాణిజ్య లోటు 15.28 బిలియన్ డాలర్లు కాగా
స్వల్పలాభాలతో ప్రారంభం
Tuesday 16th July 2019ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ మంగళవారం భారత్ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 38,960 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,596 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది.