News


డిమాండ్‌ భయాలు..పడిపోయిన చమురు

Monday 5th August 2019
Markets_main1564979382.png-27532

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధిస్తానని వ్యాఖ్యానించడంతో డిమాండ్‌ భయాల దృష్ట్యా సోమవారం ట్రేడింగ్‌లో చమురు బలహీనంగా ఉంది.  బ్రెంట్ క్రూడ్‌ 0.8 శాతం తగ్గి బ్యారెల్‌ 61.39 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌  0.4 శాతం తగ్గి బ్యారెల్‌ 55.42 డాలర్లకు పడిపోయాయి. ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేస్తుందని, ఇరాన్‌ ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుంది. ఫలితం‍గా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల వలన చమురు ధరలకు కొంత మద్దతు లభిస్తున్నప్పటికి అంతర్జాతీయ డిమాండ్‌ భయాలు వెంటాడుతున్నాయి.  
  గత వారం బ్రెంట్ క్రూడ్‌ 2 శాతానికి పైగా, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతానికి పైగా పడిపోయాయి. ‘బలహీనమైన ఆర్థిక కార్యకలాపాలు, అనుకూలంగా లేని వాతావరణం, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది చమురు డిమాండ్‌ తగ్గుతోంది’ అని గోల్డ్మన్ సాక్స్‌ ఒక పరిశోధన నివేదికలో తెలిపింది. ట్రంప్ గత వారం 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తానని, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వాణిజ్య ఒప్పందంపై వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే తాను మరింత సుంకాలు పెంచుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వలన చైనా నుంచి వదిగుమతి చేసుకుంటున్న అన్ని ఉత్పత్తులపై యుఎస్‌ సుంకాలు విధించినట్టవుతుంది. కాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తిరిగి పోరాడతామని చైనా శుక్రవారం ప్రకటించింది. ఈ చర్య వలన ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధ సంధికి బీటలు వారాయి. రెండు పెద్ద దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని, దీని వలన చమురు వంటి వస్తువుల డిమాండ్‌ పడిపోతుందని పరిశీలకులు తెలిపారు. 
  డబ్యూటీఐ చమురు ఎగుమతులు జూన్‌ నెలలో రోజుకు 260,000 బ్యారెల్స్ (బిపిడి) పెరిగి 31.6 లక్షల బిపిడి నెలవారీ రికార్డుకు చేరుకున్నాయని యుఎస్ సెన్సస్ బ్యూరో తెలిపింది. ఇది మార్కెట్లో చమురు పుష్కలంగా ఉందనే సంకేతాన్ని ఇస్తుందని పరిశీలకులు తెలిపారు.  ఇరానియన్ రివల్యూషనరీ గార్డులు అక్రమంగా ఇంధన రవాణా చేస్తుందని గల్ఫ్‌లో ఒక ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా ఆదివారం పశ్చిమ దేశాలలో ఉద్ద్రిక్తతలు పెరిగాయి. 

 



You may be interested

భగ్గుమన్న బంగారం

Monday 5th August 2019

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ పతనంతో సోమవారం బంగారం ధరలు భగ్గమన్నాయి. నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల  బంగారం ధర రూ.600 ఎగసి రూ.36,990ల రికార్డుస్థాయిని అందుకుంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల కనిష్టానికి పతనమైంది. బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే రూపాయి  బలహీనపడటంతో బంగారం ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ సైతం దేశీయ

రూపాయి భారీ పతనం...70.46 స్థాయికి

Monday 5th August 2019

అంతర్జాతీయ సంకేతాలతో పాటు, దేశియ మార్కెట్లు వరుస సెషన్‌లలో భారీగా నష్టపోతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 55 పైసలు బలహీనపడి 70.46 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 69.59 వద్ద ముగిసింది. మొత్తంగా గత వారంలో రూపీ డాలర్‌ మారకంలో 71 పైసలు బలహీనపడింది. ఈ ఏడాది మే 17 తర్వాత ఇదే రూపీకి కనిష్టస్థాయి కావడం గమనర్హం. అంతర్జాతీయంగా రెండు పెద్ద దేశాల

Most from this category