News


గోల్డ్‌ బాండ్‌ ధర గ్రాముకు రూ.3,499

Saturday 3rd August 2019
Markets_main1564806917.png-27510

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ 2019-2020 (సిరీస్‌ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమవుతుంది. ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్‌ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అటువంటి ఇన్వెస్టర్లు గ్రాముకు చెల్లించాల్సింది రూ.3,449 మాత్రమేనన్న మాట. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. 



You may be interested

తిరిగి లాభాల్లోకి ఆంధ్రాబ్యాంకు

Saturday 3rd August 2019

బ్యాంకింగ్‌ రంగ సం‍స్థ ఆంధ్రాబ్యాంకు జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో లాభాలను ప్రకటించింది. ఈ కాలంలో రూ.51.56 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు రూ.540 కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి త్రైమాసికంలో రూ.1,233 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.5,092 కోట్ల నుంచి రూ.5,437 కోట్లకు ఎగసింది. స్థూల నిరర్ధక ఆస్తులు 16.69 నుంచి 16.44 శాతానికి వచ్చి చేరాయి. మార్చిలో ఇది

రూ.148కే టర్మ్‌ప్లాన్‌

Saturday 3rd August 2019

ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మొబిక్విక్‌ భాగస్వామ్యంతో రూ.లక్ష నుంచి జీవిత బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తోంది. మొబిక్విక్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా యూజర్లు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. రూ.లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. రూ.లక్ష బీమాకు ఏడాదికి ప్రీమియం రూ.148. అదే రూ.3 లక్షల బీమాకు ప్రీమియం రూ.443, రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.738.

Most from this category