STOCKS

News


బంగారం ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు

Tuesday 12th November 2019
Markets_main1573553542.png-29534

బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు ఈ అక్టోబర్‌లో రూ.31కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు రెండునెలల్లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి దాదాపు రూ.200 కోట్ల నికర పెట్టుబడులు ప్రవహించగా, అక్టోబర్‌లో మాత్రం కొంతమేర పెట్టుబడులు వెనక్కువెళ్లాయి. సెప్టెంబర్‌లో రూ.44.11 కోట్ల నికర పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో ఏకంగా రూ.145.29 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. సాధారణంగా అనిశ్చితి సమయాల్లో బంగారం సంబంధిత పెట్టుబడులను రక్షణాత్మక ఆస్తులుగా భావిస్తారు. బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు అనిశ్చితి కొనసాగడం,  తదితర కారణాలతో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పెట్టుబడులు ప్రవాహం పెరిగిందని విశ్లేషకులంటున్నారు. అయితే వాణిజ్య యుద్ధం ముగిసే సంకేతాలు వెల్లడికావడంతో అక్టోబర్‌లో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు.  యాంఫీ​గణాంకాల ప్రకారం, చివరి నెలలో గోల్డ్-లింక్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.31.45 కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది.

2011, 2012ల్లో బంగారం ధర అనూహ్య ర్యాలీ అనంతరం చాలా ఏళ్ల పాటు స్తబ్దుగా ట్రేడైంది. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది బంగారం తిరిగి ర్యాలీ చేయడం మొదలు పెట్టింది. ఇటీవల బంగారం ధర ప్రపంచమార్కెట్లో ఆరేళ్ల గరిష్టాన్ని తిరిగి అందుకుంది. ఇది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించడంతో ఆగస్టు, సెప్టెంబర్లో‌ బంగారం ఈటీఎఫ్‌ల్లోకి నికర ప్రవాహాలు పెరిగాయి. అయితే రానున్న రోజుల్లో రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు తగ్గనుండటం, ఈటీఎఫ్‌ల్లో నికర ప్రవాహాం ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారని మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ మేనిజింగ్ శ్రీవాత్సవ తెలిపారు.

 గోల్డ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని (ఏయూఎం-అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) ఆస్తుల విలువ సెప్టెంబర్‌లో రూ.5,652 కోట్లుగా ఉంది.  అక్టోబర్‌ చివరినాటికి ఈ నిధులు రూ.5,613కోట్లుగా నమోదయ్యాయి.

ఇండియాలో బంగారం ధర రూ.40వేల గరిష్టం నుంచి రూ.2000కు పైగా నష్టపోయింది.  అయితే దీర్ఘకాలం దృష్ట్యా, ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా తమ పోర్ట్‌ఫోలియోలో బంగారంని అట్టిపెట్టుకుంటారు. ఇది రానున్న రోజుల్లో ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ పెంచే అవకాశంగా ఉందని అల్‌టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీనియర్‌ ఫండ్‌ సలహాదారుడు చిరాగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు.

గతకొన్నేళ్లుగా రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అధికంగా ఈక్విటీల్లో పెడుతున్నారు. ఫలితంగా వరుసగా ఐదేళ్లుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గాయి.  

గడిచిన ఆరేళ్లలో బంగారం ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల ఉపసంహరణ
క్రమసంఖ్య సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ(కోట్లలో..)
1 2018  రూ.571
2 2017 రూ.730
3 2016 రూ.942
4 2015 రూ.891
5 2014 రూ.1,651
6 2013 రూ.1,815

 You may be interested

ఇన్ఫోసిస్‌ సీఈఓపై మరో ఫిర్యాదు

Tuesday 12th November 2019

  కంపెనీ లాభాలను ఎక్కువ చేసి చూపేందుకు అనైతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారని, ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై తాజాగా వచ్చిన విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదు మరవకముందే, మరోక విజిల్‌ బ్లోయర్‌ ఈ సీఈఓకు వ్యతిరేకంగా కంపెనీ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలకేని, ఇతర స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాశారని ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ సోమవారం పేర్కొంది. ‘ఇన్ఫోసిస్‌ సీఈఓగా సలీల్‌ పరేఖ్‌ 20 నెలల కిందట నియమితులయ్యారు. నియమావళి ప్రకారం

పది కంపెనీల్లో రాకేశ్‌ వాటా మార్పులు!

Tuesday 12th November 2019

సెప్టెంబర్‌లో ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా  పోర్టుఫోలియోలోని పది స్టాకుల్లో వాటాలు మార్పులు పొందాయి, మరో 15 కంపెనీల్లో వాటాలు స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రాకేశ్‌ ఐదు కంపెనీల్లో వాటాలను పెంచుకున్నాడు మరో ఐదింటిలో వాటాలు తగ్గించుకున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌, ఎన్‌సీసీ, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ షేర్లను సెప్టెంబర్లో రాకేశ్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇంతవరకు ఈ షేర్లు దాదాపు 9-

Most from this category