News


గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం!

Saturday 17th August 2019
Markets_main1566024345.png-27833

అంతర్జాతీయ మందగమన పరిస్థితులు తగ్గకపోవడంతో పాటు ట్రేడ్‌వార్‌ అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఇన్వెస్టర్లు ఏకంగా 2.6 కోట్ల డాలర్ల పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టారని, మార్చి 2013 తర్వాత ఇదే అత్యధికమని ప్రపంచ గోల్డ్‌ సమాఖ్య విడుదల చేసిన డేటా పేర్కొంది. కాగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో బుల్‌ రన్‌ ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉందని సహజ వనరుల పరిశోధన కంపెనీ, గోహ్రింగ్ అండ్‌ రోజెన్‌క్వాజ్ ఓ నివేదికలో తెలిపింది. ‘ఈ బుల్‌ మార్కెట్‌ను  పాశ్చాత్య ఇన్వెస్టర్లు నడుపుతున్నారు. బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరగడానికి పాశ్చాత్య పెట్టుబడులు ప్రధాన కారణమని మేము నమ్ముతున్నాం’ అని ఈ సంస్థ తెలిపింది. గత కొన్ని నెలల్లో, బంగారం, వెండి భౌతిక ఈటీఎఫ్‌లలో వీటి పరిమాణం పెరిగిందని వివరించింది. కాగా ప్రస్తుతం ఈటీఎఫ్‌లలో బంగారం హోల్డింగ్స్, 2012 సంవత్సరంనాటి గరిష్ఠాలకు చేరుకున్నాయని ఈ నివేదిక తెలిపింది. 
     ‘వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం విక్రయాలు జరపకుండా, కొనుగోళ్లకు అధికంగా ప్రాధాన్యం ఇస్తుండడంతో బంగారానికి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా బంగారం ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని విక్రయించకపోవడంతో గత ఎనిమిదేళ్లలో బంగారం భౌతిక సరఫరా కేవలం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ద్వారానే అధికంగా జరుగుతోంది’ అని గోహ్రింగ్‌ అండ్‌ రోజెన్‌క్వాజ్‌ పేర్కొంది. ఈటీఎఫ్‌లను 2004 లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భౌతిక బంగారం మార్కెట్లలో ఈటీఎఫ్‌లు ప్రధానమైన వనరులుగా మారాయి. అప్పటి నుంచి ఎనిమిదేళ్లపాటు ఈ ఫండ్స్‌లోకి నిరంతరాయంగా బంగారం వచ్చి చేరడంతో, 2012 చివరి నాటికి భౌతిక బంగారం ఈటీఎఫ్‌లు, 2,600 టన్నుల బంగారాన్ని కూడబెట్టగలిగాయి’ అని ఈ నివేదిక తెలిపింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత భౌతిక బంగారం ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు అధికంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు, హెడ్జ్ ఫండ్ల నుంచి వచ్చినట్టు నివేదిక తెలుపుతోంది. అంతేకాకుండా గోల్డ్‌ ఈటీఎఫ్‌ వృద్ధి ఇండియాలో కూడా అధికంగా ఉంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌ నష్టాలను చూస్తుంటే, ఎన్‌ఎస్‌ఈ ఈటీఎఫ్‌ విలువ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పెరగడం గమనార్హం. గోల్డ్‌ ఫ్యూచర్స్, బంగారం బౌతిక నాణేలు లేదా బార్లు లేదా బంగారు ఈక్విటీలను కొనుగోలు చేయడం 1970 లలో సంక్లిష్టంగా ఉండేదని, బంగారం ఈటీఎఫ్‌లు అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు చేయడం మరింత సులువయ్యిందని పరిశీలకులు తెలిపారు.  You may be interested

ఈక్విటీ ర్యాలీతో తగ్గిన పసిడి

Saturday 17th August 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి 7.60 నష్టపోయి 1,523.60 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ వారంల మొత్తంలో 15 డాలర్లు లాభపడిన పసిడికి ఇది మూడో వారమూ లాభాల ముగింపు. ఇదేవారంలో 1,490.75 - 1,545.95 రేంజ్‌లో ట్రేడైంది. జర్మనీ ఆర్థిక ఉద్దీపన చర్చలతో

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 17th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా లాభపడింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,069.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11064.65 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్‌:- జర్మన్‌ ఆర్థిక ఉద్దీపన చర్యలు వార్తలతో పాటు

Most from this category