News


పసిడి ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం

Wednesday 12th February 2020
Markets_main1581478103.png-31712

  • జనవరిలో రూ. 200 కోట్లు
  • ఏడేళ్లలో ఇదే అత్యధికం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయపరమైన అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు.. పసిడి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారు. దేశీయంగా ఇదే ధోరణి ప్రతిబింబిస్తూ.. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌)లో వరుసగా మూడో నెలా పెట్టుబడుల రాక కొనసాగింది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇది ఏడేళ్ళ గరిష్టం. 2012 డిసెంబర్ తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం ఇదే ప్రథమం. అప్పట్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 474 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో నికరంగా రూ. 202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 27 కోట్లు, నవంబర్‌లో రూ. 7.68 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ నమోదయ్యాయి. "కరోనా వైరస్‌ ప్రభావాలపై ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ మరింతగా పెరుగుతోంది. అందుకే పసిడిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి" అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా అనలిస్టు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. యాంఫీ గణాంకాల ప్రకారం డిసెంబర్‌ ఆఖరు నాటికి గోల్డ్‌ ఫండ్స్‌లో రూ. 5,768 కోట్లుగా ఉన్న పెట్టుబడులు జనవరి ఆఖరు నాటికి 7.6 శాతం పెరిగి.. రూ. 6,207 కోట్లకు చేరాయి. 



You may be interested

12150పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 12th February 2020

రెండోరోజూ లాభాల ప్రారంభమే మెటల్‌, అటో షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు  దేశీయ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 114 పాయింట్ల పెరిగి 41,330.85 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లాభంతో 12,151.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం తగ్గముఖం పట్టవచ్చనే ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో

రెండో రోజూ లాభాల ఓపెనింగ్‌?!

Wednesday 12th February 2020

గ్యాపప్‌ ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?! ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌ మంగళవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు ఎగసి 12,163 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,128 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా

Most from this category