News


ఏ స్థాయి వద్దయినా బంగారాన్ని కొనండి: మార్క్‌ మొబియస్‌

Wednesday 21st August 2019
Markets_main1566365920.png-27916

-మార్క్‌ మొబియస్‌
అనేక దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ మానేటరీ పాలసీని సులభతరం చేయడంతోపాటు, పెరిగిన క్రిప్టోకరెన్సీ వాడకం బంగారం వంటి నిజమైన ఆస్తుల డిమాండ్‌ను పెంచుతోందని వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అన్నారు. ​బంగారంలో పెట్టుబడులు దీర్ఘకాలంలో రివార్డులను ఇస్తాయని వివరించారు. ‘నగదు సరఫరా పెరుగుతుండడంతో బంగారం దీర్ఘకాలిక అవకాశాలు పైపైకి వెలుతున్నాయి’ అని అన్నారు. బంగారాన్ని ఏ స్థాయి వద్దయిన కొనుగోలు చేయడం మంచిదని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మూడు దశాబ్దాలు పనిచేశాక గత ఏడాది మొబియస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీని మార్క్‌ మొబియస్‌ స్థాపించిన విషయం తెలిసిందే. 
   యుఎస్- చైనా మధ్య సుదీర్ఘ వాణిజ్య యుద్ధం వలన మందగించిన ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్‌తో పాటు ఇతర కేంద్ర బ్యాంకులు తమ దేశాలలో మానెటరీ పాలసీని సులభతరం చేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఈ నెలలో బంగారం ధరలు ఆరేళ్ల గరిష్టాన్ని తాకడాన్ని చూశాం. అంతేకాకుండా యుఎస్‌ ట్రెజరీ మార్కెట్‌, ఆర్థిక మాంద్యం ఉండవచ్చని సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలోకి అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ‘సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో బంగారం వంటి ఆస్తుల డిమాండ్‌ అమాంతం పెరిగింది’ అని మొబియస్‌ అన్నారు. ఇన్వెస్టర్ల పోర్టుపోలియోలో 10 శాతం వరకు బౌతిక బంగారాన్ని చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. కాగా బంగారం‍పై టార్గెట్‌ ధరను మాత్రం చెప్పలేదు. 
   బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీల వాడకం పెరుగుతుండడంతో విలువైన లోహాల మార్కెట్లో వాటి అంతర్గత విలువపై చర్చ పెరిగిందని, క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ప్రజాదరణ వలన బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని ఆయన వివరించారు. ‘క్రిప్టోకరెన్సీలున్నాయి. కొత్తగా వస్తున్న కరెన్సీలను చూస్తున్నాం. నేను వీటిని ‘సైకో కరెన్సీల’ని పిలుస్తాను. ఎందుకంటే బిట్‌కాయిన్ లేదా ఇతర సైబర్ కరెన్సీలను నమ్మడంపై వాటి మనుగడ ఆదారపడి ఉంటుంది. ఈ కరెన్సీల వాడకం పెరిగితే బంగారం వంటి నిజమైన, కఠినమైన ఆస్తుల కోసం డిమాండ్ పెరుగుతుంది’ అని మొబియస్‌ వివరించారు. 
   స్పాట్ బంగారం - ఆగస్టు 13 న ఔన్సు 1,535.11 డాలర్లను తాకింది. 2013 తర్వాత ఈ ధరే అత్యధికం కావడం గమనార్హం. గత సెషన్లో బంగారం 0.5 శాతం పెరిగి 1,503.46 డాలర్లకు చేరుకుంది. మొత్తంగా ఈ ఏడాది 17 శాతం పైనే బంగారం లాభపడడం విశేషం. కాగా జూలై ప్రారంభంలోనే బంగారం ధర(ఔన్సు) 1,500 డాలర్ల మార్కును దాటుతుందని మొబియస్‌ ఓ ఇంటర్యూలో తెలిపారు. ప్రపంచ మందగమనానికి సంకేతాలు వెలుగులోకి రావడంతో కేంద్ర బ్యాంకులు బంగారం వంటి ఆస్తులను కూడబెట్టడం వేగవంతం చేశాయి. ఫెడ్ గత నెలలో వడ్డీ రేట్లను దశాబ్దానికి పైగా తొలిసారిగా తగ్గించిన విషయం తెలిసిందే. మేము చైనా, ఇతర ప్రాంతాలలో తక్కువ వడ్డీ రేట్ల చూడనున్నామని మొబియస్‌ తెలిపారు.You may be interested

ఫెడ్‌ మినిట్స్‌ కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 21st August 2019

ఇన్వెస్టర్లు, ట్రేడర్లు యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌పై దృష్టిసారించిన నేపథ్యంలో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధరలు 3డాలర్ల నష్టంతో 1,512.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. జూలై 30, 31 తేదీల్లో జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ అమెరికాలో నేటి రాత్రి విడుదల కానున్నాయి. దాదాపు 10ఏళ్ల తరువాత ఫెడ్‌ వడ్డీరేట్లపై కోత విధించిన

టాప్‌ బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ సిఫార్సులు

Wednesday 21st August 2019

దీర్ఘకాలానికి 22- 117 శాతం వరకు లాభాన్నిచ్చే ఆరు స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఐటీడీ సిమెంటేషన్‌: ఆనంద్‌రాఠీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 103. అప్‌సైడ్‌ అంచనా- దాదాపు 49 శాతం. 2. జేబీఎం ఆటో: దోలత్‌ రిసెర్చ్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 248. అప్‌సైడ్‌ అంచనా- 66 శాతం. 3. ఆయిల్‌ ఇండియా: కేఆర్‌ చౌక్సీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 196. అప్‌సైడ్‌ అంచనా- 32

Most from this category