News


2020లో ఆభరణాలకు డిమాండ్‌ తగ్గుదల: ఇక్రా నివేదిక

Wednesday 1st January 2020
Markets_main1577865010.png-30587

ఈ 2020 ఏడాదిలో అభరణాలకు డిమాండ్‌ 6 నుంచి 8శాతం తగ్గముఖం పట్టే అవకాశం ఉందని ఇక్రా నివేదిక తెలిపింది. పెరిగిన పసిడి ధరలతో పాటు బలహీన వినియోగ డిమాండ్‌లు ఇందుకు కారణవుతాయని ఇక్రా పేర్కోంది. నల్లధనాన్ని ప్రక్షాళన చేయడం, పరిశ్రమను లాంఛనప్రాయంగా మార్చడం, ఇతర అసెట్స్‌ క్లాస్‌తో పోలిస్తే ఆభరణాల్లో పెట్టుబడులు తక్కువ రాబడులను ఇవ్వడంతో భారత్‌లో గత ఐదేళ్లుగా ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ ఆర్థిక సంవత్సరం 2019తో ముగిసింది. గ్రామీణ బలహీన డిమాండ్, ఆర్థిక మందగమనం, ద్రవ్య సంక్షోభం ఆభరణాల డిమాండ్‌ను ప్రభావితం చేసింది. పసిడి ధరలు అనూహ్యంగా పెరగడంతో గతేడాది జూన్‌ నుంచి ఆభరణాలకు డిమాండ్‌ క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో శుభకార్యలు, పెళ్లిళ్ల సీజన్‌, పసిడి ధరల్లో తాత్కలిక పతనంతో దేశీయంగా ఆభరణాలకు కొంత డిమాండ్‌ పెరగవచ్చని ఇక్రా అంచనా వేస్తుంది. 

సాధారణంగా భారత్‌ లాంటి దేశాల్లో ఏడాది పొడవునా ఆభరణాల కొనుగోలు ఉంటుంది. అక్షయ తృతయ, పెళ్లిళ్ల సీజన్‌, పండుగ సమయాల్లో పసిడికి మరింత డిమాండ్‌ ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2018 లో పసిడి ఆభరణాలు 8.9శాతం వృద్ధిని సాధించిన తరువాత భౌతిక పసిడి ధరలు పెరగడం, ఆ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో శుభకార్యాలు తక్కువగా ఉండటం, రత్నాలు, ఆభరణాలపై రుణాలు మరింత కఠినతరం చేయడంతో పసిడి ఆభరణాలకు డిమాండ్‌ ఫ్లాట్‌గా ఉందని ఇక్రా నివేదికలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 మొదటి అర్థభాగంలో, పసిడి ధరలు 20శాతం పెరగ్గా ఆభరణాలు డిమాండ్‌ 9.5శాతం తగ్గింది.

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం, డాలర్‌ బలహీనత, ఫెడ్‌ వడ్డీరేట్ల కోత విధింపు, ఆర్థిక వృద్ధి మందగమనం, మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు, పలు సెంట్రల్‌ బ్యాంకులు పసిడిని పెద్ద ఎత్తున నిల్వలు పెంచుకోవడం తదితర కారణాలతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు ప్రస్తుతం ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

షుగర్‌ షేర్ల సూపర్‌ ర్యాలీ

Wednesday 1st January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర రంగ కౌంటర్లు మరోసారి వెలుగులో నిలుస్తు‍న్నాయి. చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా చక్కెర ఉత్పత్తి 2019 డిసెంబర్‌ 15కల్లా 35 శాతం క్షీణించి 4.58 మిలియన్‌ టన్నులను తాకినట్లు దేశీ షుగర్‌ మిల్లుల

డిసెంబర్‌లో ఆటో అమ్మకాలు వీక్‌

Wednesday 1st January 2020

మారుతీ వాహన విక్రయాలు 3.9 శాతం అప్‌ మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాల వెనకడుగు గడిచిన డిసెంబర్‌ నెలలో దేశీ ఆటో రంగ అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. కొత్త ఏడాది ప్రారంభంకానున్న నేపథ్యంలో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, వడ్డీ రేట్ల తగ్గుదలపై అంచనాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో వివిధ ఆటో దిగ్గజాల వాహన విక్రయ గణాంకాలు చూద్దాం.. మారుతీ సుజుకీ కార్ల తయారీ దిగ్గజం

Most from this category