బంగారంలో పెట్టుబడులు పెట్టండి: మార్క్ మోబియస్
By Sakshi

వడ్డి రేట్లు తగ్గుతుండడం, బంగారం కొనుగోళ్లను సెంట్రల్ బ్యాంకులు పొడిగించడానికి సిద్ధపడడం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థీతులలో అనిశ్చితి నెలకొని ఉండడం, క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి సంకేతాల వలన బంగారం గరిష్ఠ స్థాయిలను తాకనుందని, ఇది ఔన్సు 1,500 డాలర్ల పైకి ఎగబాకనుందని పెట్టుబడి నిపుణుడు మార్క్ మోబీస్ అన్నారు. మూడు దశాబ్దాలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ఇన్వెస్టమెంట్లో పనిచేసి గత ఏడాది మోబియస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎల్ఎల్పీ పేరుతో ఆయన కొత్తగా సంస్థను ప్రారంభించారు. సింగపూర్‌లో జరిగిన ఇంటర్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.
‘వడ్డి రేట్లు తగ్గితే ఎక్కడికి వెళతావు? బులియన్ మార్కెట్లో కనీసం 10 శాతమయిన హోల్డింగ్ ఉంచుకోవాలి’ అని సూచించారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం, అమెరికా, యూరోప్ దేశాలు వడ్డీ రేట్ల తగ్గింపుకు మొగ్గు చూపడంతో పాటు ట్రేడ్ వార్ భయాల వలన 2019లో బంగారం గత ఆరేళ్ల ధరల కంటే అధికంగా ర్యాలీ చేసింది. దీంతో పాటు రష్యా, చైనా వంటి పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లను పెంచుకోనుండడం, క్రిప్టోకరెన్సీకి తిరిగి డిమాండ్ పెరగడం వంటి కారణాల వలన బంగారానికి డిమాండ్ పెరిగింది’ అని మోబియస్ తెలిపారు.
‘వడ్డి రేట్లు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు యూరప్‌లో. వడ్డి రేట్లు సానుకూలంగా లేనప్పుడు యూరోను అట్టి పెట్టుకోవడం వలన ఉపయోగం ఏముంటింది? బంగారంలో పెట్టుబడిపెట్టడం మంచిది ఏందుకంటే గోల్డ్ అన్నిటికన్నా మంచి కరెన్సీ’ అని వివరించారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డి రేట్లను తగ్గించనుందనే సంకేతాల నేపథ్యంలో జూన్ 25న బంగారంస్పాట్ ఔన్సు 1439.21 డాలర్లను తాకింది. 2013 ఏప్రీల్ తర్వాత ఇదే గరిష్ఠస్థాయి. 2013 ఏప్రిల్‌లో ఔన్సు స్పాట్ బంగారం 1,500 డాలర్లను తాకింది. ఈ గురువారం(జులై 4) ట్రేడింగ్‌లో 1,414 వద్ద బంగారం ట్రేడవుతోంది.
You may be interested
ఇన్ఫ్రా నుంచి టాప్3 బెట్స్
Thursday 4th July 2019ఆనంద్ రాఠీ సిఫార్సులు బడ్జెట్లో మౌలిక వసతులపై ఎక్కువ ఫోకస్ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ రాఠీ సంస్థ మూడు టాప్ ఇన్ఫ్రా షేర్లను రికమండ్ చేస్తోంది. 1. ఎల్అండ్టీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 1820. గత క్యు4లో కంపెనీ ఆదాయంలో సుమారు 10.5 శాతం లాభం నమోదు చేసింది. ఇన్ఫ్రా విభాగంలో కంపెనీ సమయానికి ప్రాజెక్టులను అందించడం కలిసివచ్చే అంశం. హైడ్రోకార్బన్ విభాగంలో కూడా స్థిర వృద్ది నమోదు చేస్తోంది.
52-వారాల గరిష్టానికి యూపీఎల్
Thursday 4th July 2019పంట రక్షణ ఉత్పత్తుల తయారీ కంపెనీ యూపీఎల్(యునైటెడ్ పాస్పరస్ లిమిటెడ్) కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 52-వారాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.654.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వర్షకాల సీజన్‌తో కంపెనీ కార్యకలాపాలు ఊపందుకుంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు ధర 8.30శాతం పెరిగి రూ.705.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఈ ధర షేరు 52-వారాల