News


4రోజుల్లోనే రూ.1110 పెరిగిన పసిడి

Saturday 28th December 2019
Markets_main1577513712.png-30494

దేశీయ పసిడి ఫ్యూచర్లకు ఈ వారం బాగా కలిసొచ్చింది. కేవలం 4 ట్రేడింగ్‌ సెషన్‌ల్లోనే ఏకంగా రూ.1100లు లాభపడింది. దేశీయం ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్‌ ధర సోమవారం రూ.38,040 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో అంతర్జాతీయ పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయితో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ కదలాడటం తదితర అంశాలు పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పసిడి రూ.39080.00 స్థిరపడింది. 

ఇక నిన్నటి రోజున అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు 3నెలల గరిష్టం వద్ద ముగియడటంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 4పైసలు బలహీనపడటంతో రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్‌ ధర రూ.198లు లాభపడి రూ.39వేల పైన రూ.39080.00 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణించడటం పాటు పసిడి దిగుమతులపై అధిక సుంకాల విధింపుతో ఈ ఏడాదిలో స్పాట్‌ గోల్డ్‌ ధరలు 24శాతం వరకు ర్యాలీచేశాయి. ఈ ఏడాది పసిడి భారీ పెరిగినప్పటికీ.., వచ్చే ఏడాది కూడా పసిడి బుల్‌రన్‌ చేసే అవకాశం ఉందని ఎక్కువ మంది బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగడంతో వచ్చే ఏడాది ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను యథాతధంగా ఉంచేందుకు మొగ్గుచూపవచ్చనే అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తాయని విశ్లేషకులంటున్నారు. 

అంతర్జాతీయంగా 3నెలల గరిష్టం వద్ద ముగింపు:- 
ఈక్విటీ మార్కెట్లు గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్న తరణంలో ఏ క్షణంలోనైనా లాభాల స్వీకరణ జరగవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తున్నారు. అలాగే డాలర్‌ బలహీనత సైతం పసిడి బలపడేందుకు తోడ్పాటునిచ్చిం‍ది. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో 3.70డాలర్ల పెరిగి రూ.1,518.10 వద్ద స్థిరపడింది. ఈ ధర పసిడికి 3నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇక వారం మొత్తం మీద పసిడి ధర 35డాలర్లు(35డాలర్లు) మేర లాభపడింది. You may be interested

రానున్న కాలంలో చిన్న షేర్లదే హవా

Saturday 28th December 2019

ఖరీదైన లార్జ్‌క్యాప్స్‌ నుంచి బయటపడుతున్నాం రీజనబుల్‌గా ఉన్న మిడ్‌క్యాప్స్‌వైపు మళ్లుతున్నాం -పంకజ్‌ టిబ్రేవాల్‌  కొటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ కొద్దిపాటి హెవీవెయిట్స్‌తో ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో వచ్చిన ర్యాలీ భవిష్యత్‌లో ఇతర కౌంటర్లకూ విస్తరించనున్నట్లు కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంసైతం పుంజుకోనున్నట్లు చెబుతున్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు

పీఎస్‌యూ బ్యాంక్స్‌లో ఎస్‌బీఐ భేష్‌

Saturday 28th December 2019

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని సవాళ్లు లార్జ్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య గ్యాప్‌ తగ్గొచ్చు సిద్ధార్ధ్‌ సెడానీ అంచనా ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌ కొన్నేళ్లుగా మొండిబకాయిల సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇకపైనా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్ధ్‌ సెడానీ. విద్యుదుత్పత్తి కంపెనీలపట్ల ఆశావహంగా లేమంటూనే ప్రసారం, పంపిణీ విభాగంలోని కంపెనీలపట్ల చూపు సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల

Most from this category