News


కీలకంగా 1,286 డాలర్ల స్థాయి..

Monday 1st April 2019
Markets_main1554102727.png-24903

- అంతకన్నా తగ్గితే మరింత క్షీణత
- పసిడిపై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ: బాండ్ ఈల్డ్‌ల తగ్గుదలతో పుత్తడి రేట్లకు కాస్త ఊతం లభించినా.. పటిష్టంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు, అమెరికన్ డాలర్‌ను గట్టిగా ఎదుర్కొనలేకపోతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగిసినా.. బంగారం ఇంకా పూర్తి స్థాయిలో పరుగులు పెట్టేందుకు కావాల్సిన ఊపు కనపర్చలేకపోతోందని పరిశీలకులు తెలిపారు. ఈ నేపథ్యంలో టెక్నికల్‌గా చూస్తే పసిడి అంత ఆశావహంగా కనిపించడం లేదని డెయిలీఎఫ్‌ఎక్స్ సంస్థ సీనియర్ కరెన్సీ స్ట్రాటెజిస్ట్ క్రిస్టోఫర్ వెషియో వివరించారు. ఆర్థిక మందగమనంపై మార్కెట్ అంచనాలు, వాస్తవ గణాంకాలకు మధ్య వ్యత్యాసాలు భారీగా ఉండటం ఇందుకు కారణంగా ఆయన చెప్పారు. దీంతో టెక్నికల్‌గా సమీప భవిష్యత్‌లో ఔన్సుకి (31.1 గ్రాములు) 1,286 డాలర్ల స్థాయి కీలక మద్దతుగా నిలవొచ్చని పేర్కొన్నారు. ఒకవేళ 1,285 డాలర్ల స్థాయి కన్నా తగ్గితే.. ఆ తర్వాత 1,277 డాలర్ల దాకా బంగారం రేట్లు క్షీణించవచ్చని వివరించారు. మరోవైపు శాక్సో బ్యాంక్ సంస్థ కమెడిటీ స్ట్రాటెజీ విభాగం హెడ్ ఓల్ హ్యాన్‌సెన్ కూడా సమీప భవిష్యత్‌లో 1,283 డాలర్ల స్థాయి.. పసిడికి కీలకంగా ఉండగలదని ఇంకో నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో జూన్ కాంట్రాక్ట్ పసిడి ధర 1,296.95 డాలర్ల దగ్గర ముగిసింది. దేశీయంగా వారాంతంలో (శుక్రవారం) ఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 395 తగ్గి, రూ. 32,700 వద్ద క్లోజయ్యింది. అటు ఆభరణాల బంగారం కూడా అంతే క్షీణతతో రూ. 32,530 దగ్గర ముగిసింది.



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 1st April 2019

రికార్డు ర్యాలీ కొనసాగిస్తున్న మార్కె్‌ట్‌లో మెటల్‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం ఇందుకు కారణమవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3.33శాతం లాభపడింది. చైనా ఆదివారం ఈ దేశపు పీఎంఐ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 49.9గా నమోదైన ఇండెక్స్‌ మార్చిలో 50.8 ఎగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ వినియోగదారు దేశమైన చైనా పీఎంఐ గణాంకాలు మార్కెట్‌

సిమెంట్‌ స్టాకుల జోరు

Monday 1st April 2019

ధరలు పెంపు ఊహాగానాల నేపథ్యంలో సిమెంట్‌ కంపెనీల షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి భారీగా ధరలు పెంచుతున్నట్లు సిమెంట్‌ కంపెనీలు తమ డీలర్లకు తెలియజేసాయని బోఫాఎంఎల్‌ ఒక నివేదికలో వెల్లడించింది. మార్చిలో కంపెనీలు ధరలను పెంచినా పదిరోజుల్లోనే పెంచిన ధరలను తగ్గించాయి. దక్షిణాదిన ఈ దఫా సిమెంట్‌ బస్తా ఒక్కింటి రూ.20 చొప్పున పెంచాలని కంపెనీలు నిర్ణయించాని నివేదిక తెలిపింది. దీంతో సోమవారం ఇండియా సిమెంట్స్‌

Most from this category