STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Monday 14th October 2019
Markets_main1571031287.png-28868

అమెరికా చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందంతో కిత్రం వారం ముగింపు రోజున భారీ పతనమైన పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం గం.11:10ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప లాభంతో 1,491.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాబోయే రోజుల్లో పసిడి ధరకు బ్రిగ్జిట్‌, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల అంశాలు కీలకం కానున్నాయి. బ్రెగ్జిట్‌కు ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అక్టోబర్ 31న బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగుతుందని బోరిస్ జాన్సన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై ఎలాంటి సంకేతాలను ఇస్తుందోనని మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి అధికారుల వాణిజ్య చర్చల్లో ఇరుదేశాలు పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లించడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గి శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో 12.20 డాలర్లు నష్టపోయి 1,488.70 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయ మార్కెట్లో రూ.40ల తగ్గుదల:- 
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం సెషన్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ. 40లు నష్టంతో రూ.37805 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాలు దేశీయంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. 



You may be interested

పాజిటివ్‌గా రియల్టీ..డీఎల్‌ఎఫ్‌ 6% ర్యాలీ!

Monday 14th October 2019

 దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, ఆర్‌బీఐ రేట్‌ను  బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో సోమవారం రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  ఓక్‌ట్రీ క్యాపిటల్‌తో నాన్‌ బైండింగ్‌ టెర్మ్‌ షీట్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు, సిద్ధంగా ఉన్న 376 లక్సరీ ప్లాట్‌లను గురుగ్రామ్‌లోని తన హౌసింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రోజునే డీఎల్‌ఎఫ్‌ రూ. 700 కోట్లకు విక్రయించడంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరువిలువ 6.52 శాతం

బ్యాంక్‌ నిఫ్టీ 300 పాయింట్లు అప్‌!

Monday 14th October 2019

  దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం కానుండడంతో ప్రభుత్వ బ్యాంకులు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభల్లో ట్రేడవుతుండడం, దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో బలపడడం వంటి కారణాల వలన బ్యాంకింగ్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 327.35 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 28,369.85

Most from this category