News


స్థిరంగా పసిడి ధర

Monday 15th July 2019
Markets_main1563166879.png-27056

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలాడుతోంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప పెరుగుదలతో 1,413 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా నేడు రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఈ క్యూ2లో చైనా దేశపు వృద్ధిరేటు భారీగా క్షీణించింది. 1992 తరువాత వృద్ధిరేటు అతి తక్కువగా 6.2శాతంగా నమోదైంది. నిరాశపరిచిన బలహీన గణాంకాలు ప్రపంచ వృద్ధి మందగనంపై ఆందోళనను రేకితిస్తున్నాయి. ఈ అంశం పసిడి ధరకు మద్దతునిస్తుంది. అలాగే ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో గతవారంలో వరుసగా మూడు పతనాన్ని చవిచూసిన డాలర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో కూడా అక్కడక్కడే కదలాడుతోంది.
దేశీయంగా తగ్గుదల:- 
అంతర్జాతీంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., దేశీయంగా మాత్రం తగ్గుముఖం పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర ఉదయం గం.10:10ని.లకు రూ.70.00లు తగ్గి రూ.34,835.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 15th July 2019

యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్, ఏసీసీ, విప్రో ఫలితాలు ఈవారంలోనే.. బుధ, గురువారాల్లో జి-7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం సోమవారం డబ్ల్యూఐపీ డేటా వెల్లడి న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా నష్టాలను నమోదుచేస్తున్న దేశీ స్టాక్‌ సూచీలకు ఈవారం కీలకంగా మారనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారంనాటి ముగింపుతో రెండు నెలల కనిష్టస్థాయిని నమోదుచేసిన ప్రధాన సూచీలకు క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిశా నిర్థేశం చేయనున్నాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత

17 పైసలు బలపడిన రూపీ

Monday 15th July 2019

దేశియ స్థూల ఆర్థిక వ్యవస్థ డేటా నిరుత్సాహ పరిచినప్పటికి సోమవారం(జులై 15) రూపీ డాలర్‌ మారకంలో 17 పైసలు బలపడి 68.52 వద్ద  ప్రారంభమైంది.  మైనింగ్‌, తయారిరంగాల వృద్ధి మందగించడంతో శుక్రవారం విడుదలైన పరిశ్రమ ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఫ్యాక్టరి ఔట్‌పుట్‌ వృద్ధి మే నెలలో 3.1 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 4.3 శాతంగా నమోదైన విషయం గమనర్హం. అంతేకాకుండా రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 3.18

Most from this category