News


2వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 20th December 2019
Markets_main1576817748.png-30333

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ట్రంప్‌ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమెరికా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలతో ప్రత్యర్ది పార్టి డెమోక్రటిక్‌ సభ్యులు ట్రంప్‌ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం అయిన నేపధ్యంలో అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. సెనెట్‌(ఎగువ)లోనూ తీర్మానానికి ఆమోదం పొందితే ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అయితే సెనెట్‌లో అధ్యక్షడు ట్రంప్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న కారణంగా అభిశంసన తీర్మానం నెగ్గకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై మరింత సమాచారం కోసం ట్రేడర్లు ఎదురుస్తున్న తరణంలో బాండ్‌ ఈల్డ్‌ 4నెలల గరిష్టం నుంచి దిగిరావడం కూడా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో 5.70 డాలర్లు పెరిగి 1,484.40 వద్ద ముగిసింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో దాదాపు అదే ధర 1,484 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం విడుదలు కానున్న అమెరికా జీడీపీ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూపులు సైతం పసిడికి స్థిరమైన ర్యాలీకి మరో కారణంగా నిలిచింది. 
దేశీయంగా రూ.100లు నష్టం:- 
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర నష్టాల బాట పట్టింది. డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి శుక్రవారం రూ.100లు నష్టపోయి రూ.38009 వద్ద ట్రేడ్‌ అవుఓంది. రూపాయి విలువ ఫ్లాట్‌గా ప్రారంభం కావడం, దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా 3రోజూ జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం పసిడి ఫ్యూచర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్‌ ధర రూ.37,920 - రూ.38,250 రేంజ్‌లో కదలాడవచ్చని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నరాత్రి ప్రపంచమార్కెట్లో పసిడి ధర రెండు వారాల గరిష్టాన్ని అందుకున్న నేపథ్యంలో దేశీయంగా రూ.197లు లాభపడి 38వేల పైన రూ.38109 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్‌ ధర రూ.37,920 - రూ.38,250 రేంజ్‌లో కదలాడవచ్చని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. You may be interested

కొత్త ఏడాది ఈక్విటీ రిటర్న్స్‌ అంతంతమాత్రమే!

Friday 20th December 2019

బ్రోకరేజ్‌ల అంచనాలు వచ్చే సంవత్సరం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒక మోస్తరు రాబడులే అందిస్తాయని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వాల్యూషన్లు పెరిగిపోవడం, ఆర్థిక మందగమనం కొనసాగడం, ప్రభుత్వం నుంచి విత్త సాయానికి పరిమిత అవకాశాలుండడం.. మార్కెట్లపై ఒత్తిడి పెంచుతాయని అభిప్రాయపడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... 1. బీఎన్‌పీ పారిబా: సెన్సెక్స్‌పై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌, 2020 టార్గెట్‌ 44,500. జీడీపీ వృద్ది అంచనాల్లో

సాంక్టమ్‌ వెల్త్‌ టాప్‌ సిఫార్సులు

Friday 20th December 2019

వచ్చే మూడు నాలుగు వారాలకు మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2070. స్టాప్‌లాస్‌ 1740. జూలైలో వేగంగా పతనమై ఆగస్టు నాటికి రూ.1348 కనిష్ఠానికి వచ్చింది. అక్కడ నుంచి తిరిగి వేగంగా పెరిగి సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్‌ హై రూ. 1898ని తాకింది. ఆపై కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మరలింది. ప్రస్తుతం షేరు ధర కీలక డీఎంఏలకు పైన ఉంది.

Most from this category