News


1500 డాలర్ల పైకి పసిడి

Friday 25th October 2019
Markets_main1571981872.png-29135

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తిరిగి 1500డాలర్లను అందుకుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,505 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి రెండు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. అమెరికా విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి బలపడేందుకు తోడ్పడింది. నిన్నరాత్రి అమెరికా సెప్టెంబర్‌ మాసపు డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్ల గణాంకాలను విడుదల చేసింది. గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంలో విఫలం అయ్యాయి. అంతంత మాత్రంగా నమోదైన ఆర్థిక గణాంకాలతో వచ్చేవారంలో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాల్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలు మొదలైయ్యాయి. తక్కువ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పడ్డాయి. అలాగే ఇన్వెస్టర్లును ఆర్థిక మాంద్య భయాలు మరోసారి వెంటాడాయి. ఫలితంగా రాత్రి అక్కడి మార్కెట్లో  ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు పెరిగి 1,504.70 డాలర్ల వద్ద స్థిరపడింది. మాంద్యం భయాలు మళ్లీ పెరుగుతున్నందున పసిడికి మరోసారి డిమాండ్‌ప పెరిగిందని సెవెన్స్ రిపోర్ట్ రీసెర్చ్ సహ సంపాదకుడు టైలర్ రిచీ అన్నారు.  
దేశీయ మార్కెట్లోనూ ర్యాలీయే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే  దేశీయ బులియన్‌ ధరలు కదులుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి నిన్న ట్రేడింగ్‌లో 5రోజుల వరుస ర్యాలీకి ముగింపు పలుకుతూ 11 పైసలు నష్టపోయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడం తదితర కారణాలతో ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.350 లాభపడి రూ.38352 వద్ద స్థిరపడ్డాయి. నేడు రూ.29.00ల స్వల్ప నష్టంతో రూ.38323.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సుప్రీం తీర్పుతో కొత్త కనిష్ఠానికి వోడాఫోన్‌ఐడియా

Friday 25th October 2019

  లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలివ్వడంతో గురువారం సెషన్‌లో 27 శాతం పతనమయిన వొడాఫోన్‌ ఐడియా షేరు, శుక్రవారం ట్రేడింగ్‌లో కూడా మరో 10 శాతం నష్టపోయి రూ. 3.65 వద్ద కొత్త జీవిత కాల కనిష్ఠాన్ని తాకింది. వోడాఫోన్‌-ఐడియా షేరు ఉదయం 10.54 సమయానికి 8.05 శాతం నష్టపోయి రూ. 4.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 27 శాతం పడిపోయి రూ. 4.35 వద్ద

ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 25th October 2019

లాభంలో భారీ పెరుగుదల ఉంటుందని అంచనాలు దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ శుక్రవారం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభం భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐలైఫ్‌లో వాటాల విక్రయంతో బ్యాంకుకు వన్‌టైమ్‌ మొత్తం సమకూరడంతో లాభంలో బాగా వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 2.7 శాతం లాభంతో రూ. 268.80 వద్ద ట్రేడవుతోంది.  - ఎస్‌బీఐ

Most from this category