News


పసిడి పరుగే... పరుగు!

Wednesday 4th March 2020
Markets_main1583292622.png-32255

  • అంతర్జాతీయంగా 50 డాలర్లకుపైగా పెరుగుదల
  • దేశంలోనూ రూ.1,000కి పైగా అప్‌
  • రూపాయి ‘బలహీనత’ మరోబలం

ఆర్థిక మందగమనం, కరోనా కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి మీమాంస తగదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారంనాటి విమర్శలు,  ఆయా అంశాల నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు తప్పదన్న ఊహాగానాలు, ఇందుకు అనుగుణంగా మంగళవారం నిర్ణయం నేపథ్యంలో పసిడి గడచిన రెండు రోజుల్లో తిరిగి భారీగా పెరిగింది. మంగళవారం అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి 49డాలర్ల లాభంతో 1,644.40 డాలర్ల వద్ద స్థిరపడింది. నిజానికి వారం క్రితం ఏడేళ్ల గరిష్టం 1,691 డాలర్లకు చేరిన పసిడి గత వారం ముగిసేనాటికి 1,565 డాలర్ల వరకూ పడిపోయింది. ఇది కేవలం లాభాల స్వీకరణగా తాజా పరిస్థితిని చూస్తే అర్థం అవుతోంది. 

రూపాయి...గరిష్టానికి 100 పైసలు దూరంలో...
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత పసిడికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి జారింది.  2018 అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.  తాజా రూపాయి బలహీనత కూడా తోడు కావడంలో ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ. 1518లు లాభపడి రూ.43474 వద్ద స్థిరపడింది. ఇదే ధోరణి కొనసాగితే బుధవారం పలు పట్టణాల్లోని స్పాట్‌ మార్కెట్లలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర రూ.44,000 దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



You may be interested

ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు చర్యలు

Wednesday 4th March 2020

కరోనా ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం ఆర్‌బీఐ ప్రకటన ముంబై: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌బీఐ ప్రకటించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిణామాలను ఆర్‌బీఐ నిరంతరం సునిశితంగా పరిశీలిస్తోంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లు సజావుగా నడిచేందుకు, మార్కెట్లలో విశ్వాసాన్ని కాపాడేందుకు, ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది’’ అంటూ ఆర్‌బీఐ ప్రకటన తెలియజేసింది. అవసరమైతే ప్రభుత్వంతో కలసి

మార్కెట్లు నేడు నేలచూపులతో!

Wednesday 4th March 2020

0.5 శాతం వడ్డీ రేటు తగ్గించిన ఫెడ్‌ మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డౌన్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 41 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,190 వద్ద తొలి సపోర్ట్‌! నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30   ప్రాంతం‍లో 41 పాయింట్లు తక్కువగా 11,280 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,321 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

Most from this category