News


ఫెడ్‌ నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు

Wednesday 31st July 2019
Markets_main1564550761.png-27433

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు చూస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 2నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి స్థిరంగా కదులుతోంది. బుధవారం ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,430.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ సమావేశం కారణంగా పసిడి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఇంతకాలం వేచిచూసారు. ఒకవేళ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించినట్లైతే పసిడి ధర కొంత దిగిరావచ్చు. ఇప్పటికే వడ్డీరేట్లపై 25 బేసిస్‌ పాయింట్లు కోత ఉండవచ్చనే అంశాలు ఉన్నాయి. ట్రేడర్లు ఇంకా కోత విధింపు 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉండవచ్చా అని ఎదురుచూస్తున్నారు. ఓవరాల్‌గా ధీర్ఘకాలికానికి  పసిడి ధర ఇప్పటి బుల్లిష్‌గా ఉంది. పసిడి ర్యాలీ చేసే తరుణంలో స్వల్పకాలికంగా పసిడి ధరలో కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
దేశీయంగానూ రూ.50లు తగ్గింపు:-
దేశీయంగా పసిడి ధర మూడో నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.50 స్వల్పనష్టంతో రూ.34479.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఫెడ్‌ నిర్ణయం కొరకు ఎదురుచూపులు తదితర అంశాలు పసిడికి ప్రతికూలంగా మారాయి. నిన్నటి రోజు ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.180 నష్టంతో రూ.34, 529ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.244లు నష్టపోయింది.



You may be interested

3 శాతం లాభపడిన హీరో..పాజిటివ్‌గా ‘ఆటో’

Wednesday 31st July 2019

హీరోమోటర్‌ కార్ప్‌ క్యూ1 పలితాలలో మార్కెట్‌ అంచనాలను సునాయాసంగా అధిగమించింది. ఈ కంపెనీ క్యూ1లో రూ. 785 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని మార్కెట్లు​ అంచనా వేయగా గత ఏడాది ఇదే త్రైమాసిక నికర లాభం కన్నా  38 శాతం పెరిగి రూ. 1,257 కోట్లను నమోదుచేసింది. ఫలితంగా బుధవారం ఆటో షేర్లు పాజిటివ్‌లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.78 శాతం లాభపడి 6,816.65 వద్ద ట్రేడవుతోంది. ఈ

తగ్గిన రూపీ, బాండ్‌ ధరలు

Wednesday 31st July 2019

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశియంగా ద్యవ్యోల్బణం పెరుగుతుందని మార్కెట్‌ ఆందోళన చెందడంతో రూపీ, బాండ్‌ ధరలు బుధవారం పడిపోయాయి. దీంతోపాటు కీలక ఫెడ్‌ సమావేశం ముందు ట్రంప్‌ చైనాను ఒత్తిడికి గురిచేస్తుండడంతో  ట్రేడ్‌ వార్‌ తిరిగి ప్రారంభమవుతుందనే ఆందోళనలలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. రూపీ డాలర్‌ మారకంలో బుధవారం 4 పైసలు బలహీనపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ  68.86 వద్ద ముగిసింది.   పదేళ్ల ప్రభుత్వ

Most from this category