News


స్థిరంగా పసిడి ధర

Wednesday 4th September 2019
Markets_main1567575532.png-28176

ఆర్థిక మాంద్య భయాలతో నిన్నటి రోజు ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2డాలర్ల స్వల్ప లాభంతో 1,559 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరపోవడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి.  

బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. నో డీల్‌ బ్రెగ్జిట్‌పై పార్లమెంటు ఓటింగ్‌ జరగడానికి ముందే టోరీ రెబల్‌ ఎంపీల్లో ఒకరైన ఫిలిప్‌ లీ  ఈయూ అనుకూల లిబరల్‌ డెమొక్రాట్ల వైపు ఫిరాయించడంతో బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని టోరీ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. దీంతో బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధమైనట్లు ప్రకటించారు.


 అలాగే యు.ఎస్. తయారీ గణాంకాలు మూడేళ్ల కనిష్టస్థాయిలో నమోదుచేయడంతో పాటు,  వాణిజ్య చర్చలు ఓ కొలిక్కిరాకపోతే  రెండవసారి బీజింగ్ పై "కఠినంగా" ఉంటానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం కూడా పసిడి ధరకు అండగా నిలుస్తున్నాయి.

బలహీన ఆర్థిక గణాంకాలు నమోదు కావడంతో ఫెడ్‌ వడ్డీరేట్ల కోతకు మార్గం మరింత సులభతరమైంది. ఇది పసిడి ధర మరింత బలపడేందుకు దోహదపడుతుందని ఫిలిప్‌ ఫ్యూచర్స్‌ విశ్లేషకుడు బెంజిమన్‌ లూ అభిప్రాయపడ్డారు. 
దేశీయంగా స్థిరంగా:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లు గానే దేశీయంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లోని అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర క్రితం రాత్రి ముగింపు(రూ.39680)తో పోలిస్తే ఉదయం గం.10:30ని.లకు రూ.13ల స్వల్పలాభంతో 39693.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్లో ఒకేరోజు 97 పైసలు పతనమై తొమ్మిది నెలల కనిష్ట స్థాయి (72.39)కి చేరిన నేపథ్యంలో పసిడి ధర రూ.593లు(1.50శాతం) పెరిగి రూ.39680 వద్ద స్థిరపడింది.



You may be interested

జీడీపీ అంచనాలు కట్‌

Wednesday 4th September 2019

కుదించిన  ఆర్థిక సేవల సంస్థలు కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం రికవరీ బలహీనంగానే ఉండొచ్చని అంచనా న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ఆర్థిక సేవల సంస్థలు కుదించాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఫిచ్‌ సొల్యూషన్స్‌.. 6.8 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించగా, సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ కూడా 6.8 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. గత

నష్టాల్లో మారుతి, బజాజ్‌ ఆటో

Wednesday 4th September 2019

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పాటు, తగ్గిన వాహన విక్రయాలు వలన దేశియ ఆటోరంగ షేర్లు  బుధవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి 1.32 శాతం  (ఉదయం 10.29 సమయానికి),  బోచ్‌ లి. 1.07 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 0.58 శాతం, బజాజ్‌ ఆటో 0.26 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.09 శాతం నష్టపోవడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.82 శాతం కోల్పోయి 6,841.20

Most from this category