News


స్థిరంగా పసిడి

Thursday 17th October 2019
Markets_main1571288103.png-28944

అమెరికా రిటైల్‌ అమ్మకాల గణాంకాలు బలహీనంగా నమోదు కావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,492.05 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్నరాత్రి సెప్టెంబర్‌ రిటైల్‌ గణాంకాలను విడుదల చేసింది. ధీర్ఘకాలంగా చైనాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం అమెరికా తయారీ రంగంపై ప్రభావాన్ని చూపడంతో 7నెలల్లో తొలిసారిగా తగ్గుముఖం పట్టాయి. బలహీన రీటైల్‌ గణాంకాలు వచ్చే నెలలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు రేకిత్తించాయి. అలాగే బ్రెగ్జిట్‌, చైనా వాణిజ్య చర్చల ఒప్పంద అనిశ్చితులతో రాత్రి అమెరికా  మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా అక్కడి మార్కెట్‌ ముగిసే సరికి పసిడి ధర 10.50డాలర్లు లాభపడి 1,494 డాలర్ల వద్ద స్థిరపడింది.  
దేశీయ మార్కెట్లో స్వల్ప తగ్గుదల:-
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.85.00లు పెరిగి రూ.38425.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ లాభాల ప్రారంభం పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నిన్న రాత్రి అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర అరశాతం (రూ.183లు) లాభపడి రూ.38219 వద్ద ముగిసింది. క్రితం నెలలో ఆరేళ్ల గరిష్టాన్ని తాకిన పసిడి ధర నాటి నుంచి రూ.1800ల వరకు పతనమైంది. 



You may be interested

మార్కెట్‌ జోరు తగ్గుతోందా?!

Thursday 17th October 2019

సంకేతాలున్నాయంటున్న నిపుణులు నిఫ్టీ ఈవారాన్ని లాభాలతో కొనసాగిస్తున్నా, సూచీల్లో జోరు సన్నగిల్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. బుల్స్‌ ఇకమీదట ఉత్సాహంగా పరుగులు తీయలేకపోవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలానికి ఒక శ్రేణిలోనే మార్కెట్‌ కదలికలుండవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం నిఫ్టీ సుమారు 36 పాయింట్లు లాభపడింది. గురువారం వీక్లీ ఆప్షన్‌ ఎక్స్‌పైరీ ఉన్నందున సూచీలు తీవ్ర కదలికలు నమోదు చేయవచ్చని అంచనా. ప్రస్తుతానికి నిఫ్టీకి 11500- 11585 పాయింట్ల జోన్‌

భారీగా పెరిగిన యుఎస్‌ నిల్వలు..నష్టాల్లో చమురు

Thursday 17th October 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు మరింత పెరిగాయి. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.59 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.67 శాతం నష్టపోయి బారెల్‌ 59.02 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.79 శాతం నష్టపోయి బారెల్‌ 52.94 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్‌ 11తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు 10.5

Most from this category