News


1300డాలర్ల దిగువనే పసిడి

Thursday 16th May 2019
Markets_main1557989698.png-25766

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల దిగువను స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి అరశాతం స్వల్పనష్టంతో 1,297.45డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా టెలికాం దిగ్గజం హువాయి కంపెనీపై సుంకాన్ని విధించింది. దీంతో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు ఆశలు సన్నగిల్లాయి. ఈక్విటీ మార్కెట్లో అంతర్లీనంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు పసిడి ర్యాలీకి సహకరిస్తాయి. స్వల్పకాలంలో 1280 - 1310 డాలర్ల శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది. అయితే అమెరికా కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో ఉన్నందున పసిడి లాభాలు పరిమితి కావచ్చని నేషనల్‌ ఆస్ట్రేలియా బ్యాంక్‌ ఆర్థిక వేత్త జాన్‌ శర్మ అభిప్రాయపడ్డారు. 
దేశీయంగానూ స్థిరంగానే:-
ఇక దేశీయంగా పసిడి స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.10ల స్వల్ప నష్టంతో రూ.32263.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత పసిడి పతనాన్ని అడ్డుకుంటుంది.



You may be interested

ఎగసిన వాణిజ్య లోటు

Thursday 16th May 2019

5 నెలల గరిష్టానికి చేరిక  ఏప్రిల్‌లో వృద్ధి 4 నెలల కనిష్ఠం గణనీయంగా తగ్గిన ఎగుమతులు 4.5 శాతం పెరిగిన దిగుమతులు భారీగా చమురు, పసిడి దిగుమతులు న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా

యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ డేగకన్ను!?

Thursday 16th May 2019

గాంధీ నియామకమే నిదర్శనం ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఆర్‌గాంధీని యస్‌బ్యాంక్‌ అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ నియమించింది. ఈ నియమాకంతో యస్‌బ్యాంక్‌పై మరింత నిశిత పరిశీలన జరపాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ చేపట్టిన క్లీనప్‌ కార్యక్రమానికి అండగా ఉండేందుకు గాంధీని నియమించారని భావిస్తున్నారు. బ్యాంకుపై ఆర్‌బీఐకున్న అనుమానాలను ఈ నియామకం ధృవపరుస్తోందని విశ్లేషకులు అనుకుంటున్నారు. గాంధీ నియామకం అంతిమంగా ఇన్వెస్టర్లకు మేలు చేయకపోవచ్చని ఎక్కువమంది భయపడుతున్నారు. ఈ భయాలతోనే

Most from this category