News


1400డాలర్ల దిగువకు పసిడి

Monday 1st July 2019
Markets_main1561955843.png-26699

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 1400డాలర్ల దిగువకు పతనమైంది. చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్నట్లు ట్రంప్‌ శనివారం ప్రకటించడం, ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో నేడు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం ఇందుకు కారణమయ్యాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 26డాలర్లు వరకు నష్టపోయి 1,387.50డాలర్ల స్థాయి వద్ద పతనమయ్యాయి. ఇది పసిడి ధర వారంరోజుల కనిష్టస్థాయి కాడం గమనార్హం.

జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన జీ20 సమావేశాల్లో  అగ్రరాజ్యాలైన అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్యయుద్ధ చర్చలు ఓకొలిక్కి వచ్చాయి. తాజాగా 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయడంతో  చైనా టెక్ కంపెనీ హువావేపై ఆంక్షలను సడలిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అలాగే చైనాతో వాణిజ్య చర్చలు పునఃప్రారంభించనట్లు తెలిపారు. అలాగే చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలను రద్డు చేయడంతో పాటు అమెరికాతో చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం తెలిపింది.

ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగియడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు తరలిస్తున్నారు. రెండువారాలుగా పసిడి భారీగా ర్యాలీ చేసిన నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో కూడా పసిడికి ప్రతికూలాంశంగా మారింది. డాలర్‌ ఇండెక్స్‌ కూడా 0.25శాతం బలపడటంతో పసిడి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 19.15 డాలర్లు నష్టపోయి 1,394.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

దేశీయంగా అదే దోరణి:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర భారీగా నష్టపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1400డాలర్ల దిగువకు రావడంతో ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర ఉదయం ట్రేడింగ్‌లోనే ఏకంగా రూ.400 నష్టపోయి రూ.33,802ల వద్ద కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:00లకు రూ.389ల నష్టంతో రూ.33817.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం రాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.31ల స్వల్పలాభంతో 34206.00 వద్ద స్ధిరపడిన సంగతి తెలిసిందే.



You may be interested

బడ్జెట్‌పైనే మార్కెట్‌ దృష్టి

Monday 1st July 2019

శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్‌, గురువారం ఆర్థిక సర్వే అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి ఉంటుందన్న సామ్కో ఆశాజనకంగా కొనసాగిన జి–20 సదస్సు, వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక తెర ముంబై: ఈఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ సర్కార్‌.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్‌ను

పెరిగిన చమురు

Monday 1st July 2019

రష్యా, సౌది అరేబియా, ఇరాక్‌ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గింపు కాలపరిమితిని పొడింగించాడానికి సుముఖత చూపడంతో ఆయిల్‌ ధరలు సోమవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 1.12 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.86 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 1.10 శాతం పెరిగి బ్యారెల్‌కు 59.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ఉత్పత్తి తగ్గిం‍పు ఇంకో 9 నెలలు పొడిగించే అవకాశం ఉందని

Most from this category