పసిడి ర్యాలీకి బ్రేక్..!
By Sakshi

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల అంశంపై స్పష్టత రావడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర గురువారం దిగివస్తుంది. ఆసియాలో నేటి ఉదయం ఔన్స్ పసిడి ధర 10డాలర్ల మేర నష్టపోయి 1,553.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అక్టోబర్ మొదట్లో ఉన్నత స్థాయి చర్చలకు సన్నాహకంగా తమ వాణిజ్య బృందం సెప్టెంబర్ మధ్యలో యుఎస్ వాణిజ్య అధికారలతో చర్చలు జరుపుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా జరుతున్న వాణిజ్యయుద్ధం కారణంగా ఆర్థిక మందగమన భయాలు మొదలయ్యాయి. అలాగే పలుదేశాల కేంద్రబ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటికే పసిడి ధర 23శాతం ర్యాలీ చేసింది. వాణిజ్య చర్చలకు తేదీ ఖరారు కావడం, హాంగ్ కాంగ్లో నెలల తరబడి హింసాత్మక నిరసనలకు కారణమైన వివాదాస్పద అప్పగింత బిల్లును ఉపసంహరించనున్నట్లు ఆ దేశ నేత కారీ లామ్ ప్రకటించడం, బ్రెగ్జిట్ సంబంధిత అనిశ్చితుల తగ్గుముఖం పట్టపడం లాంటి అంశాలు పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వాణిజ్య చర్చలు అనుకున్న రీతీలో జరగకపోతే పసిడి తిరిగి ర్యాలీ చేసే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సాంకేతికంగా పసిడి ధర 1,560డాలర్ల వద్ద నెలకొన్న బలమైన నిరోధాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఒకవేళ ఈ స్థాయిని పసిడి అధిగమిస్తే రానున్న రోజుల్లో 1,600డాలర్ల స్థాయిని అందుకునేందుకు మరెంతోకాలం పట్టకపోవచ్చు. ప్రస్తుతం పసిడికి 1520డాలర్ల వద్ద బలమైన మద్దతు స్థాయి ఉందని విశ్లేషకులంటున్నారు.
దేశీయంగా అరశాతం పతనం:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా పసిడి ధర నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. నేడు ఎంసీఎక్స్ మార్కెట్లోని అక్టోబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర క్రితం రాత్రి ముగింపు(రూ.39823)తో పోలిస్తే ఉదయం గం.10:30ని.లకు రూ.321.00లు నష్టపోయి రూ.39502.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి రోజు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ కారణంగా రూ.143లు పెరిగి రూ.39823 వద్ద స్థిరపడింది.
You may be interested
సెప్టెంబర్ సీరిస్‌లో 10800- 11200 రేంజ్లో నిఫ్టీ!
Thursday 5th September 2019నిఫ్టీ సెప్టెంబర్ సీరిస్ మొత్తం 10800- 11200 పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని టెక్నికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శ్రేణిని ఛేదించడం జరిగితేనే నిఫ్టీలో తీవ్రకదలికలుంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు దిగువన 10800 పాయింట్ల దిగువన వరుసగా రెండు రోజులు క్లోజయితే 10640- 10500 పాయింట్ల వరకు నిఫ్టీ దిగజారవచ్చని, ఒకవేళ 11200 పాయింట్లను దాటితే 11500- 11700 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని తెలిపాపరు. ముఖ్యంగా 11150 పాయింట్లను దాటితే మంచి
71.86 వద్ద ప్రారంభమైన రూపీ
Thursday 5th September 2019రూపీ డాలర్ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 26 పైసలు బలపడి 71.86 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు గత సెషన్లో రికవరి అయ్యాక రూపీ కూడా డాలర్ మారకంలో 27 పైసలు బలపడి 72.12 వద్ద ముగిసింది. ‘దేశియ ఈక్విటీ మార్కెట్ పాజిటివ్‌గా ముగియడం, రూపీ బలపడడంలో సహాయపడింది. గత సెషన్లో రూపీ-డాలర్ ఎన్ఎస్ఈ సెప్టెంబర్ కాంట్రాక్ట్ 72.29 గా ఉంది. అదే విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ 2.21