News


పసిడికి ఫెడ్‌ రేట్ల కోత కష్టాలు

Thursday 1st August 2019
Markets_main1564635335.png-27462

2వారాల కనిష్టానికి పసిడి ధర
మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఫెడ్‌ వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు 2వారాల కనిష్టానికి పతనమయ్యాయి. నిన్నరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు 11 ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించింది. తాజా తగ్గింపుతో ఫెడ్‌ రేటు 2.25-2శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ మందగమన ఆందోళనలు, యూఎస్‌ ద్రవ్యోల్బణం నీరసించిన నేపథ్యంలో వడ్డీరేట్లపై కోత విధింస్తున్న ఫెడ్‌ ఛైర్మన్‌ చెప్పుకొచ్చారు. అయితే రానున్నరోజుల్లో కోత విధింపు కొనసాగకపోవచ్చనే పావెల్‌ వాఖ్యలతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. రాత్రి అమెరికా మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం ర్యాలీ చేసి 98.891 వద్ద రెండేళ్ల గరిష్టానికి చేరుకుంది. పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ బలమైన ర్యాలీతో పసిడి ప్యూచర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో  1,426.10 డాలర్ల వద్ద స్థిరపడింది. అక్కడి పతనానికి కొనసాగింపుగా నేడు ఆసియా మార్కెట్లోనూ అదే ట్రెండ్‌కు కొనసాగిస్తుంది. ఒక దశలో 21 డాలర్లు మేర క్షీణించి 1405.30డాలర్ల కనిష్టాన్ని తాకింది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 15.60డాలర్లు క్షీణించి 1,410.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా రూ.100 పతనం:- 
దేశీయంగా పసిడి పతనం 4రోజూ కొనసాగుతుంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.100 నష్టంతో రూ.34413.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి భారీ పతనం దేశీయ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నిన్నటి రోజు ఎంసీక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.12 నష్టంతో రూ.34,517ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.256లు నష్టపోయింది.



You may be interested

పడిపోయిన చమురు

Thursday 1st August 2019

యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోత మరింతగా ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో గురువారం చమురు ధరలు ఒక డాలర్‌ మేర పడిపోయాయి.యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు, ఒపెక్‌ దేశాలలో​చమురు ఉత్పత్తి తగ్గడం, లిబియా ఎగుమతులను తగ్గించడం తదితర సానుకూల అంశాలున్నప్పటికీ, క్రూడ్‌ ధరలు తగ్గాయి. బ్రెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.6

40 పైసలు బలహీనపడిన రూపీ

Thursday 1st August 2019

 రేట్ల కోత కోత మరింతగా ఉండదనే సంకేతాన్ని ఫెడ్‌ ఇవ్వడంతో డాలర్‌ రెండేళ్లలో గరిష్ఠంగా బలపడింది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో 40 పైసలు బలహీనపడి 69.20 వద్ద గురువారం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉండడంతో పాటు, యుఎస్‌ ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. కానీ మరింతగా రేట్ల కోత ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. గత సెషన్‌లో రూపీ డాలర్‌

Most from this category