News


ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు...?

Thursday 20th February 2020
Markets_main1582189311.png-31961

రోజురోజుకి బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.కోవిడ్‌-19 ప్రభావంతో గురువారం ప్రపంచ మార్కెట్లో ఏడేళ్లగరిష్టానికి పసిడి ధరలు చేరుకున్నాయి. అయితే వైరస్‌ ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడకుండా  చైనా కొన్ని సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర దాదాపు 2 వేల డాలర్లకు చేరే అవకాశం ఉందని సిటీగ్రూపుకు చెందిన కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఫ్యూచర్‌లో ఔన్స్‌ బంగారం ధర 8.20 డాలర్లు పెరిగి 1,611.80 ముగిసింది. ఈ విధంగా పెరగడం వరుసగా ఇది ఐదోరోజు.  2013 మార్చి నుంచి ఇప్పటిదాకా ఇదే గరిష్టస్థాయి. బంగారం ధర 1600 డాలర్లకు చేరుకోవడంతో వైరస్‌ ప్రభావంతో గ్లోబల్‌ ఎకానమీకి ఏ స్థాయిలో నష్టం జరుగుతుందోనని అంచనా వేస్తున్నారు. మార్కెట్లు రక్షణాత్మక పెట్టుబడులు, ఉహాజనిత ప్రేరణలకు లోనవుతుండడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయని సిటీ గ్రూపు విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్‌-19 ప్రభావంతో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడంతో అమెరికా డాలర్‌, స్టాక్‌ మార్కెట్‌లు లబ్ది పొందుతున్నప్పటికీ, సెంట్రల్‌ బ్యాంకులు ఆర్థికవ్యవస్థను కుంటుపడనీయకుండా ఉండేందుకు చర్యలు చేపడతాయన్న ఉద్దేశంతో  పసిడి, వెండితోపాటు స్టాక్‌మార్కెట్లు పరుగుపెడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 12-24 నెలల్లో రికార్డుస్థాయిలో ఔన్స్‌ బంగారం ధర 2000 డాలర్ల(రూ.48000)కు చేరే అవకాశం ఉందని సిటీగ్రూపు విశ్లేషకులు అంచనా. 2011 సెప్టెంబర్‌ 6న ఇంట్రాడేలో గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,923.70 డాలర్లకు చేరింది. 

దేశీయంగా పసిడి రూ.50,000కు!
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు చేరితే తదనుగుణంగా దేశీయ  మార్కెట్లో 10 గ్రాముల పసిడి దాదాపు రూ.50,000కు చేరే అవకాశం ఉందని దేశీయ మార్కెట్‌ నిపుణులు సునీల్‌ కుమార్‌ కట్కే చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఈ ధర 42,000-42,500 శ్రేణి వరకూ పెరగవచ్చని ఆయన అంచనావేశారు. అంతేగాక వెండిధరలు కూడా ఇదే బాటలో నడుస్తాయన్నారు. దేశీయంగా కేజీ వెండి ధర రానున్న కొద్దిరోజుల్లో రూ.47,500 నుంచి రూ.50,000 మార్కు చేరే అవకాశం ఉందని కట్కే అంచనావేసి వెల్లడించారు.
 You may be interested

మరో రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌ ఐడియా

Thursday 20th February 2020

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్‌ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంగతి తెలిసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు,

కరోనాతో ఏపీఐ ఫార్మా షేర్ల లాభాల పంట!

Thursday 20th February 2020

నాట్కో ఫార్మా, ‍శిల్పా మెడి, గ్రాన్యూల్స్‌కు జోష్‌ గత రెండు నెలల్లో 40- 110 శాతం మధ్య ప్లస్‌ దేశీయంగా యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీఐ) తయారు చేసే కంపెనీల కౌంటర్లు గత కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. ఫార్ములేషన్స్‌, ఫినిష్డ్‌ డోసేజీల తయారీలో వినియోగించే ఏపీఐలను దేశీయంగా పలు కంపెనీలు రూపొందిస్తున్నాయి. అయితే చైనా నుంచి సైతం అధిక శాతంలో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజాలు ఏపీఐలు, ఇంటర్మీడియెట్లను దిగుమతి చేసుకుంటుంటాయి. ఇటీవల చైనాలోని

Most from this category