News


రూ.187 పెరిగిన పుత్తడి

Thursday 13th February 2020
Markets_main1581567094.png-31742

 

కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెడుతుండడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.187 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.40,607.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,576.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


(బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు

Thursday 13th February 2020

2019-20పై నాస్కామ్ అంచనా డిజిటల్‌ ఆదాయాల ఊతం ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (ఐటీ-బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019-20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన

200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య

Thursday 13th February 2020

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించింది. యూజర్లు పంపే, అందుకునే మెసేజీలు లేదా ఫోన్‌కాల్స్‌ను మూడో వ్యక్తి చూడటం గానీ వినడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ

Most from this category