News


పుంజుకుంటున్న పసిడి

Tuesday 2nd July 2019
Markets_main1562050932.png-26730

ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు, యూరప్‌- అమెరికాల ట్రేడ్‌ వార్‌ అంశాలు మళ్లీ తెరపైకి రావడంతో మం‍గళవారం పసిడి ధర తిరిగి పుంజుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు లాభపడి 1,396.05డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల నేపథ్యంలో ఈ జూన్‌లో ఆసియాలో పలుదేశాల మాన్యూఫ్చాక్చరింగ్‌ యాక్టివిటీ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదుకాగా, అమెరికాలో అయితే ఈ గణాంకాలు ఏకంగా రెండున్నరేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఆర్థిక గణాంకాలు బలహీనంగా నమోదుకావడంతో ఇన్వెస్టర్లలో అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలు మొదలయ్యాయి. విమానాల రాయితీల అంశంపై సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంపై అమెరికా ఐరోపా దేశాలపై ఒత్తిడిని పెంచింది. అమెరికాకు దిగుమతి అయ్యే 4 బిలియన్‌ దిగుమతులపై టారీఫ్‌లు విధించే ప్రతిపాదనను యోచిస్తున్నట్లు అమెరికా తెలిపింది. మరో పసిడి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంధి కుదరవచ్చనే అశాహనంతో నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్‌ ధరలు 1శాతం మేర నష్టపోయాయి. స్పాట్‌ గోల్డ్‌ గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక రోజులో ఏకంగా 1.8శాతం నష్టపోయింది. 
దేశీయంగానూ పసిడి రికవరి:-
అంతర్జాతీయ ట్రెండ్‌ దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తుంది. నేటి రూ.150ల మేర రికవరిని సాధించింది. నేడు ఎంసీఎక్స్‌లో ఆగస్ట్‌  పసిడి ఫ్యూచర్‌ కాంటాక్టు ధర రూ.150లు వరకు రివకరి సాధించింది. అంతర్జాతీయంగా పసిడి ధర పుంజుకోవడం, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. మధ్యాహ్నం 12:00లకు 10గ్రాముల పసిడి ధర రూ.100లు లాభపడి రూ.33743ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఎంసీఎక్స మార్కెట్‌ ముగింపు సమయానికి పసిడి ధర రూ.563లు నష్టపోయిన రూ.33643 వద్ద స్థిరపడింది.You may be interested

ఆన్‌లైన్‌ ఆధ్యాత్మికం..

Tuesday 2nd July 2019

భారత్‌లో 30 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఆధ్యాత్మిక కంటెంట్‌కు డిమాండ్‌ అవకాశాలు అందుకుంటున్న కొత్త స్టార్టప్స్‌ న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్‌ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్‌ టెక్నాలజీస్‌ లాంటివి

యస్‌ బ్యాంక్‌ రుణగ్రహిత డిఫాల్ట్‌

Tuesday 2nd July 2019

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సమస్యల్లో ఉండడంతో పాటు ఆర్థిక మందగమనం కారణానా యస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న  రూ.1200 కోట్ల రుణాలపై వడ్డీలను  రేడియస్‌ డెవలపర్స్‌ సంస్థ షెడ్యుల్‌ సమయంలో చెల్లించలేకపోయింది.  బ్యాంకులు ప్రకటించిన ప్రమాదకర రుణాలు రూ. 5,500 కోట్లపై వడ్డీలను తీర్చడంలో ఈ కంపెనీ గత 45-60 రోజులుగా ఆలస్యం చేసింది. ‘రూ. 30 కోట్ల వడ్డి చెల్లింపులు ఆలస్యం చేయడంతో రేడియస్‌ డెవలపర్స్‌ ఖాతా ఎస్‌ఎమ్‌ఏ 2

Most from this category