News


రూ.42,600 వద్ద స్థిరంగా పసిడి

Friday 28th February 2020
Markets_main1582865071.png-32157

కరోనా వైరస్‌ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలినప్పటికీ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల పసిడి రూ.42,611.00 వద్ద  స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,640.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
(గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 28th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు టాటా పవర్‌: సుంకాలు పెంచకపోతే గుజరాత్‌, హర్యాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల డిస్కంలకు  మార్చి నుంచి పవర్‌ సరపరాను నిలిపివేస్తామని టాటా పవర్‌ వెల్లడించింది. హెచ్‌యూఎల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆశించినస్థాయిల్లో కొనుగోళ్లు లేకపోవడం వల్ల వ్యాపార వృద్ధి సాఫ్ట్‌గా సాగుతుందని యూనిలీవర్‌ కంపెనీ వెల్లడించింది. యూనీలీవర్‌ మొత్తం విక్రయాల్లో ఇండియాలో జరిగేవి 9 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఎన్‌బీసీసీ: దక్షిణ ఢిల్లీలోని నౌరోజి

వెలుగు రేఖ కనిపించింది.. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

Friday 28th February 2020

వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ దేశంలో అపారంగా సహజ వనరులు వెలికితీసేందుకు ప్రోత్సహించాలని సూచన న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ట స్థాయి నుంచి త్వరలోనే పుంజుకుంటుందని మైనింగ్‌ దిగ్గజం, వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించినందున అది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున చేసే పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలపై వ్యయాలతోపాటు,

Most from this category