News


పెరిగిన పసిడి..!

Monday 7th October 2019
Markets_main1570424232.png-28751

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 5 డాలర్లు పెరిగింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా-చైనాల మధ్య ఈ గురు, శుక్ర (10, 11తేదీల్లో) వారాల్లో ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. ఏడాదిన్నర కాలంగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతోంది. అయితే, అమెరికా ప్రతిపాదినలకు చైనా ఒప్పుకోకపోవచ్చనే సమాచారంతో నేడు ఆసియా ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరగడంతో నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర క్రితం వారం ముగింపు(1513డాలర్లు)తో పోలిస్తే 5డాలర్లు పెరిగి 1,518 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.77.00 లాభంతో రూ.38409.00 వద్ద కదలాడుతుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడటం పసిడికి కలిసొస్తుంది. స్వల్పకాలంలో పసిడి ఫ్యూచర్లు పెరిగేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పసిడి ర్యాలీ కొనసాగితే 38,900 స్థాయి నిరోధాన్ని,  పతనమైతే రూ.37,775 వద్ద మద్దతు స్థాయిని పరీక్షించవచ్చని వారు అంటున్నారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 220 పాయింట్లు అప్‌!

Monday 7th October 2019

ఆర్‌బీఐ మరోదపా 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించడంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకింగ్‌ షేర్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 228.65 పాయింట్లు లాభపడి 28029.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.59 శాతం లాభపడి రూ. 1208.65 వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.89

నష్టాల్లో చమరు

Monday 7th October 2019

అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు సోమవారం కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.43 శాతం నష్టపోయి బారెల్‌ 58.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.27 శాతం నష్టపోయి 52.67 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం చివరిలో వాషింగ్టన్‌లో యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్ఠి మరలింది. కాగా యుఎస్‌, చైనా తయారిరంగం పనితీరు

Most from this category