News


పెరిగిన బంగారం

Thursday 10th October 2019
Markets_main1570683640.png-28797

యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో భాగంగా వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షేడ్యుల్‌కు ముందే తిరిగి చైనా వెళ్లనుండడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద అవకాశాలు తగ్గాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని స్వర్గదామంలో చూస్తున్నారు. యుఎస్‌-చైనా వాణిజ్య యుద్ధం వలన గురువారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు ఒక వారం గరిష్ఠానికి చేరుకున్నాయి. తక్షణ బంగారం 0.4 శాతం లాభపడి ఔన్సు 1,511.24 డాలర్లకు, యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్‌ 0.3 శాతం లాభపడి ఔన్సు 1,516 డాలర్లకు చేరుకున్నాయి. 
   యుఎస్‌-చైనా మధ్య సోమవారం, మంగళవారం జరిగిన డిప్యూటీ స్థాయి వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, చైనా ప్రతినిధులు వాషింగ్టన్‌ను గురువారం విడనున్నారని చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. కాగా షేడ్యుల్‌ ప్రకారం చైనా ప్రతినిధులు శుక్రవారం వాషింగ్టన్‌ను వీడాలి. వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో గురువారం ట్రేడింగ్‌లో జపాన్‌ వెలుపల ఆసియా షేర్లు ఎఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఇండెక్స్ 0.1 శాతం నష్టపోయింది. యుఎస్‌ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో చైనాకు చెందిన కొన్ని సాంకేతిక కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, ముస్లింలకు వీసా నిరాకరించడంలో భాగంగా కొంత మంది చైనా ప్రతినిధులకు వీసా నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. 
   దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఫలితంగా యుస్‌ జాబ్‌ డేటా అగష్టులో ఒకటిన్నర ఏడాది కనిష్ఠానికి పడిపోయింది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో లేబర్‌ డిమాండ్‌ తగ్గుముఖం పట్టింది. యుఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌పాల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ రేట్ల కోతకు సుముఖంగా ఉందనే సంకేతాలనిచ్చారు.



You may be interested

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 10th October 2019

నిపుణుల సూచన ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించవచ్చని ఎఫ్‌అండ్‌ఓ నిపుణులు సూచిస్తున్నారు. నెలాఖరు వరకు సూచీ 10800- 11600 పాయింట్ల మధ్యనే కదలాడుతుందన్న అంచనాలతో ఎక్కువమంది నిపుణులు ఉన్నారు. ఇలాంటప్పుడు 11200 స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద కాల్‌ మరియు పుట్‌ను రైట్‌ చేయడం(విక్రయించడం) ద్వారా షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం పాటించవచ్చని చెబుతున్నారు.  - ఈ వ్యూహంలో 11200 కాల్‌ మరియు పుట్‌ రెండిటి లాట్స్‌ను సుమారు 400 రూపాయల(బుధవారం ధరల

12 పైసలు లాభపడిన రూపీ

Thursday 10th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌ నుంచి అదనపు వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత సెషన్లో రూపీ కూడా డాలర్‌ మారకంలో ప్రారంభ

Most from this category