పసిడిలో లాభాల స్వీకరణ
By Sakshi

ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పసిడి ఫ్యూచర్లు రెండు వారాల గరిష్టం నుంచి దిగివచ్చాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 1.25డాలర్ స్వల్పలాభంతో 1,424.55 డాలరు వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి అమెరికా హౌసింగ్ గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలకు అందుకోలేకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ భారీగా క్షీణించింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత అంచనాలు మరింత బలపడటం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగడంతో అక్కడి మార్కెట్లో నిన్నరాత్రి ఔన్స్ పసిడి ధర 1.50శాతం పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయి 1,431.45డాలర్లను అందుకుంది. ఈ నేపధ్యంలో ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో గరిష్టస్థాయి(1,431.45డాలర్లు) నుంచి 19 డాలర్లు నష్టపోయి 1,425.95డాలర్ల వద్ద స్థిరపడింది. ‘‘పసిడి ధరకు కీలమైన నిరోధ స్థాయి 1430డాలర్లు అందుకుంది. ఆ స్థాయి ఛేదించడంలో మాత్రం విఫలమైంది. దీంతో స్వల్పకాలికంగా ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు’’ అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
దేశీయంగా పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టు 10 గ్రాముల పసిడి ధర ఉదయం గం.10:40ని.లకు రూ.20లు తగ్గి రూ.35071.00 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రివకరి అవుతుండటం పసిడి ర్యాలీని అడ్డుకుంటుంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరోసారి ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.278లు పెరిగి రూ.35,000 స్థాయి ఛేదించి రూ.30,090ల వద్ద ముగిసింది.
You may be interested
దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
Thursday 18th July 2019టెక్నాలజీ సంస్థ ఐసెర్టిస్‌లో పెట్టుబడులు బిలియన్ డాలర్లకు సంస్థ విలువ బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి
ఫలితాల సెగ...యస్ బ్యాంక్ 15 శాతం క్రాష్
Thursday 18th July 201915శాతం క్షీణించిన షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ప్రైవేటు రంగానికి చెందిన యస్ బ్యాంక్ షేర్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 15శాతం పతనమయ్యాయి. యస్ బ్యాంక్ నిన్న మార్కెట్ ముగింపు అనంతరం తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. తొలి క్వార్టర్లో మొండి బకాయిల బెడద కొనసాగడం, ఆస్తుల నాణ్యత క్షీణించడటం పాటు మొండిబకాయిలకు అధిక ప్రోవిజన్లు కేటాయింపులతో రూ.95.56 కోట్ల నికర