News


కనిష్టస్థాయి నుంచి పసిడి రికవరీ

Thursday 7th November 2019
Markets_main1573101391.png-29411

ప్రపంచమార్కెట్లో పసిడి ధర కనిష్టస్థాయి నుంచి రికవరీని సాధించింది. అయినప్పటికి.., 1500 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9.50డాలర్లు మేర లాభపడి 1,493.10 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించడటం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం తదితర కారణాలు పసిడి బలపడేందుకు తోడ్పాటునిచ్చాయి. అమెరికా చైనాల మధ్య కుదరాల్సిన మొదటి దశ వాణిజ్య ఒప్పందం డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడింది. బాండ్ ధరలు తగ్గడం, ఈల్డ్స్‌ పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రపంచ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయనే అంచనాలను ఇన్వెస్టర్లు తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పసిడి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. పసిడి మరింత కనిష్టానికి చేరుకున్నప్పటికీ.., పూర్తిగా దాని మెరుపును కోల్పోలేదని ఆర్‌బీసీ వెల్త్‌మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ జార్జ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి పసిడి 1,485 - 1,525డాలర్ల పరిమితి స్థాయిలో కదలాడుతుందని, లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లకు ఇది మంచి తరుణమని జార్జ్‌ తెలిపారు.
దేశీయంగా తిరిగి రూ.38000 ఎగువకు:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పసిడి ధర దేశీయమార్కెట్లో కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పుంజుకోవడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 28పైసలు బలహీనపడటం తదితర కారణాలతో పసిడి ధర నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.363 లాభపడి రూ.38000 స్థాయిపై రూ.38247 వద్ద స్థిరపడింది. నేడు గురువారం పసిడి ధర స్వల్పంగా లాభాల స్వీకరణకు చోటుకు చేసుకోవడంతో నిన్నటి ముగింపు(రూ.38247)తో పోలిస్తే రూ.41ల స్వల్ప నష్టంతో రూ.38206.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

వివిధ నగరాల్లో బుధవారం స్పాట్‌ గోల్డ్‌ ముంగింపు ధరల కోసం బటన్‌పై క్లిక్‌ చేయండి


 



You may be interested

యస్‌బ్యాంక్‌లో వాటా కోసం పోటాపోటీ!

Thursday 7th November 2019

రంగంలో రెండు బడా విదేశీ ఫండ్స్‌ దేశీయ ఫండ్స్‌ నుంచి కూడా ఆసక్తి అంతర్జాతీయ ఫండ్స్‌ డిస్కవరీ క్యాపిటల్‌, మార్షల్‌ వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా యస్‌బ్యాంక్‌ వాటాలు కొనేందుకు రేసులో ఉన్నాయని విశ‍్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలే కాకుండా దేశీయ ఇన్వెస్టర్లైన ఆదిత్య బిర్లా ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ తదితరాలు కూడా యస్‌బ్యాంకులో వాటా కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటా విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకొని ఇబ్బందుల్లోంచి

71 దిగువకు రూపాయి విలువ

Thursday 7th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 7 పైసలు నష్టపోయి 71.05 వద్ద ప్రారంభమైం‍ది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 70.98 వద్ద ముగిసింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పాటు డాలర్‌ కూడా బలహీనపడడం, చమురు ధరలు పడిపోవడం వంటి కారణాల వలన రూపీ పతనం పరిమితమయ్యింది.      ‘ఫేజ్-1 వాణిజ్య ఒప్పందం కోసం యుఎస్‌-చైనా ఆత్రుతగా ఉన్నాయి. ఈ నెలలో

Most from this category