News


ఆభరణాల పరిశ్రమకు శరాఘాతం!

Saturday 6th July 2019
Markets_main1562396211.png-26854

  • దిగుమతి సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంపు
  • బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం

 పెరిగుతుందన్న అంచనాలు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ఆభరణాల పరిశ్రమకు నిరాశనే మిగిల్చింది. దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనివల్ల ఈ విభాగంలో బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం పెరుగుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఆభరణాల ధర మరింత తీవ్రమయ్యే అవకాశమూ ఉంది. దీనితో  తక్షణం కస్టమ్స్‌ సుంకం తగ్గింపును కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో వచ్చేవారం సమావేశం కావాలని ఆభరణాల వర్తకుల సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. తాజా పరిస్థితిపై పలువురి అభిప్రాయాలు చూస్తే...

15.5 శాతం పెరగనున్న ధరలు
పెరిగిన కస్టమ్స్‌ సుంకం, దీనికితోడు జీఎస్‌టీ వెరసి ధరలు 15.5 శాతం పెరిగుతాయి. ఇది బ్లాక్‌ మార్కెట్‌ పెరిగేందుకు వీలుకల్పించే అంశం. ఇప్పటికే దేశంలో పసిడి స్మగ్లింగ్‌ ఎక్కువగా ఉంది. పసిడి స్మగ్లింగ్‌ ద్వారా 4 నుంచి 5 శాతం డిస్కౌంట్‌ లభించే వీలుండడం కస్టమర్లను ఈ దిశగా ఆకర్షిస్తుంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం వరకూ పెరిగే ఆవకాశం ఉంది. 
- ఎన్‌. అనంతపద్మనాభన్‌, ఏఐజీజేడీసీ చైర్మన్‌

ప్రతికూల ప్రభావం
భారత పసిడి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపే అంశమిది. అసలే ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పసిడి ధర దూసుకుపోతోంది. తాజా నిర్ణయంతో దేశీయంగానూ ధర మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.  ఈ నిర్ణయం వల్ల బ్లాక్‌ మార్కెట్‌లో పెరిగే అక్రమ కొనుగోళ్లు నగదు లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 
- సోమసుందనం పీఆర్‌, గోల్డ్‌కౌన్సిల్‌ ఎండీ

ఎగుమతులపై ప్రభావం
బడ్జెట్‌ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. పసిడి పరిశ్రమకు ఈ నిర్ణయం విఘాతం. పసిడి పరిశ్రమలో వ్యాపార నిర్వహణ వ్యయం పెరుగుతుంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరుగుతుంది. ఆయా పరిస్థితులతో పసిడి ఆభరణాల ఎగుమతులపైనే ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్రం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- కోలిన్‌ షా, జీజేఈపీసీ వైస్‌ చైర్మన్‌

ఇబ్బందైనా... లాభాలూ ఉన్నాయ్‌...
తాజా నిర్ణయం పరిశ్రమకు ఇబ్బందే. అయితే కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయ్‌.  డిజిటలైజేషన్‌ మరింత పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. నగదు రహిత లావాదేవీల్లోకి వ్యవస్థ మారడం వల్ల ఈ రంగంలో వ్యవస్థాగతంగా ఉన్న సంస్థలు మరింత పటిష్టమవుతాయి. పారదర్శకత ఒనగూడుతుంది. ఇదంతా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుంది. 
- సుభాష్‌ గాడ్గిల్‌, పీఎన్‌జీ జ్యూయెలర్స్‌ సీఎండీ

దిగుమతులను తగ్గించడానికే...
దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్- దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) కట్టడి లక్ష్యంగా పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్య ఇది. ఈటీఎఫ్‌, గోల్డ్‌ బాండ్స్‌ వంటి రూపాల్లో డిజిటల్‌ గోల్డ్‌ను ప్రమోట్‌ చేయడానికి, భౌతిక కొనుగోళ్లను తగ్గించడానికి తాజా నిర్ణయం దారితీస్తుంది.
- అభిశేక్‌ బన్సాల్‌, ఏబీఎన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌
రెండిందాలా నష్టం
తాజా నిర్ణయం పరిశ్రమపై రెండు రకాలుగా ‍ప్రతికూల ప్రభావం చూపుతుంది. రిటైల్‌ పరిశ్రమపై ఈ నిర్ణయం పెను భారాన్ని మోపుతుంది. ఇక దేశంలోకి అక్రమంగా పసిడి రవాణా తీవ్రమవుతుంది. ఆయా పరిస్థితులు అన్నీ దేశంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై పెను ప్రభావాన్ని చూపే వీలుంది. కనుక ఈ నిర్ణయాన్ని తక్షణం పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. 
- అహ్మద్‌ ఎంపీ, మల్‌బార్‌ గోల్డ్‌ అండ్‌ డైమెండ్స్‌ చైర్మన్‌
‍కస్టమర్‌ సెంటిమెంట్‌కు బలం
కాల క్రమంలో పసిడి ధర పెరుగుతుందనే భారత వినియోగదారు భావిస్తాడు. ఇది కస్టమర్‌ సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే. పసిడి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందన్న అతని అంచనాలకు తాజా నిర్ణయం బలం చేకూర్చుతుంది. పసిడిని ఒక ఆస్తిగా భావించి కొనుగోలు చేయడం మరింత పెరుగుతుంది. ఇక పసిడి రుణాలను అందించే ఎన్‌బీఎఫ్‌సీలకూ ఇది లాభదాయక నిర్ణయమే. 
- కేయూర్‌ షా, సీఈఓ, మూత్తూట్‌ ఎగ్జిమ్‌


తగ్గుతున్న దిగుమతులు...
కస్టమ్స్‌ సుంకాల పెంపు, దేశంలోనే అంతర్గతంగా ఉన్న పసిడిని వినియోగంలోనికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గడచిన రెండేళ్లల్లో దేశంలోకి పసిడి దిగుమతులను తగ్గిస్తున్నాయి. 2017-18లో 33.7 బిలియన్‌ డాలర్ల దిగుమతులు జరిగితే, 2018-19లో ఈ పరిమాణం 3 శాతం తగ్గి 32.8 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2015-16లో 31.8 బిలియన్‌ డాలర్ల  విలువైన పసిడి దిగుమతులు జరిగితే, 2016-17లో ఇది 27.5 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 

ప్రస్తుత ధర తీరిది...
ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24, 22 క్యారెట్లు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.35,120, రూ.33,450గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లు అన్నింటిలో ధరలు దాదాపు రూ.700 వరకూ పెరిగాయి. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ధర ఈ వార్త రాసే 9.30 గంటలకు రూ.330 లాభంతో రూ.34,545 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ధర భారీగా పెరగాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా నైమెక్స్‌లో ధర ఈ వార్త రాసే సమయానికి క్రితం రోజు ముగింపుకన్నా 30 డాలర్లకుపైగా పడిపోయి 1,390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. లేదంటే శుక్రవారమే భారత్‌ మార్కెట్‌లో ధర దాదాపు రూ.1000 వరకూ పెరిగి ఉండేది. 

 You may be interested

రైల్వే ప్రాజెక్టుల్లోనూ ‘పీపీపీ’

Saturday 6th July 2019

బడ్జెట్‌లో 65 వేల కోట్ల కేటాయింపులు మూలధన వ్యయం కింద మరో 1.6 లక్షల కోట్లు 2030 నాటికి రూ. 50 లక్షల కోట్లు అవసరం: నిర్మల న్యూఢిల్లీ: రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల

బడ్జెట్‌పై కంపెనీల రియాక్షన్లు!

Saturday 6th July 2019

ఫార్మాను నిరాశ పరిచింది.. ఆరోగ్య సేవలు, ఔషధ రంగం వృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం నిరాశ పరిచింది. పరిశోధన, అభివృద్ధికి ఊతమిచ్చేలా పన్ను రాయితీలు ఉంటాయని భావించిన పరిశ్రమకు మొండి చేయి ఇచ్చారు. పరిశ్రమ ఆశించినట్టు జరిగితే ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధితోపాటు ఆవిష్కరణలు మరింత వృద్ధి చెంది ఉండేవి.  - సతీష్‌ రెడ్డి, చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌. పన్ను సరళీకరించారు.. స్టార్టప్స్‌కు సరళీకరించిన పన్ను విధానం ప్రోత్సాహకరంగా ఉంది. 25 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధిని

Most from this category