News


డాలర్‌ ఎఫెక్ట్‌: లాభాల్లోకి పసిడి

Wednesday 2nd October 2019
Markets_main1570010749.png-28676

గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల్లో ట్రేడైన పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫ్యాక్టరీ యాక్టివిటీ పదేళ్ల కనిష్ట స్థాయికి  క్షీణించినట్లు నిన్నరాత్రి గణాంకాలు వెలువడ్డాయి. దీంతో ఆర్థిక మందగమన ఆందోళనలు తెరపైకి రావడంతో పాటు డాలర్‌,  బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనడ్డాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  ఈ పరిణామాలు పసిడి ర్యాలీకి మద్దతినివ్వడంతో అమెరికా మార్కెట్లో రాత్రి ఒకదశలో పసిడి ధర 1500డాలర్ల పైకి ఎగిసి 1,507.20డాలర్ల స్థాయిని అందుకుంది. చివరికి 16డాలర్ల(1.1శాతం) లాభంతో 1,489 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లో 1,485.20 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో పసిడి ఫ్యూచర్లలో కొంత లాభాల స్వీకరణకు చోటు చేసుకోవడంతో 9డాలర్లు నష్టపోయి 1,480.55 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగింది. అయితే, ఆసియా ఈక్విటీ మార్కెట్లతో పాటు యూరప్‌ మార్కెట్లు నష్టాల ట్రేడింగ్‌తో పసిడి మళ్లీ రికవరి బాట పట్టింది. మధ్యాహ్నం గం.3:00లకు ఔన్స్‌ పసిడి క్రితం రాత్రి ముగింపు(1,489)తో పోలిస్తే 1డాలరు స్వల్ప లాభంతో 1,489 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆగస్ట్‌ 26 నాడు 1,565డాలర్ల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర నాటి నుంచి సమారు 80డాలర్లు మేర నష్టపోయింది.
 



You may be interested

భారత్‌-22 ఈటీఎఫ్‌ నాలుగో విడత రేపే..!

Wednesday 2nd October 2019

భారత్‌-22 ఈటీఎఫ్‌(ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడుత ఇష్యూ గురువారం ప్రారంభం కాబోతుంది. తొలిరోజు యాంకర్‌ ఇన్వెస్టర్లు, మరుసటి రోజు సంస్థాగత, రిటైల్‌ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇష్యూ ద్వారా కేంద్రం రూ.8000 కోట్ల నిధుల సమీరకణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై 3 శాతం డిస్కౌంట్‌తో లభించనుంది. ఇష్యూ ద్వారా మొత్తం రూ.2000 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నాం. ఒకవేళ ఇష్యూకు అధిక స్పందన వస్తే కోట్లను

నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Wednesday 2nd October 2019

అమెరికా మార్కెట్లు నిన్నరాత్రి నష్టాల ముగింపులో అక్కడి మార్కెట్లో ఏడీఆర్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టాటామోటర్స్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, ఐసీసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌లు 3.10శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ మాత్రమే స్వల్పంగా లాభపడింది. నిన్న టాటామోటర్స్‌ విడుదల చేసిన సెప్టెంబర్‌ మాసపు వాహన గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో టాటామోటర్స్‌ ఏడీఆర్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల

Most from this category