News


స్వల్పంగా తగ్గిన పసిడి

Friday 31st January 2020
Markets_main1580445492.png-31363

రూ.40,500 పైన పసిడి
కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ షేర్‌ మార్కెట్‌లు పతనమవుతున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వేగంగా విస్తరించడం, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అంతేకాకుండా చైనా సమర్థవంతంగా వైరస్‌ను కట్టడి చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ గురువారం రాత్రి విశ్వాసం వ్యక్తం చేయడంతో...బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ. 100 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.40,606.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం రోజుతో పోలిస్తే 7 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,572 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

ఎస్‌బీఐ క్యూ3 లాభం హైజంప్‌?

Friday 31st January 2020

నికర లాభం రూ. 5577 కోట్లు! నికర వడ్డీ ఆదాయం 19 శాతం అప్‌? బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు దేశీ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. నేడు ఎస్‌బీఐ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించనుంది. ఈ ఏడాది క్యూ3లో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం 80 శాతం జంప్‌చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఎస్సార్‌ స్టీల్‌ రుణ పరిష్కారం(రిజల్యూషన్‌),

పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనానికి బ్రేక్‌

Friday 31st January 2020

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థలైన ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ప్రతిపాదిత విలీనానికి బ్రేక్‌ పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు అడ్డంకి కావడంతో విలీనం ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టేనని సమాచారం. ఏదేని ప్రాజెక్టులో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ రుణం 25 శాతానికి మించొద్దు. కొన్ని ప్రాజెక్టులకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే రుణం మంజూరు చేసి ఉన్నాయి. ఇరు సంస్థలు విలీనమైతే ఈ రుణ పరిమితి 25

Most from this category