News


ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 24th July 2019
Markets_main1563948293.png-27269

పసిడి ధర ఫెడ్‌రిజర్వ్‌ సమావేశపు నిర్ణయం కొరకు ఎదురుచూస్తోంది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,420 వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూఎస్‌ ప్రభుత్వం రుణ పరిమితి పొడిగించడటంతో నిన్నరాత్రి డాలర్‌ 5వారాల గరిష్టాన్ని అందుకుంది. అలాగే నేడు ఆసియాలో ప్రధాన ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం పసిడి ర్యాలీకి అవరోధాలుగా నిలుస్తున్నాయి. అమెరికా నిన్నరాత్రి జూన్‌ మాసపు గృహ అమ్మకాల గణాంకాలు విడుదల చేసింది. గణాంకాలు అంతంత మాత్రంగా నమోదయ్యాయి. అయిన్పటికీ, పసిడి ధర 5డాలర్ల మేర క్షీణించి 1,421.70 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల ప్రకటన వరకు పసిడి ధర 1,415-35 రేంజ్‌లో కదలాడుతుందని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
దేశీయంగానూ స్వల్ప తగ్గింపు:- 
నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.50.00లు నష్టపోయి రూ.34971 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతుండటం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ దిశగా సాగుతుండటం తదితర అంశాలు దేశీయ పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారాయి. నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.111ల నష్టపోయి రూ.35,021ల వద్ద స్థిరపడింది. 



You may be interested

ఇల్లు గెలిచింది...!!

Wednesday 24th July 2019

రిజిస్ట్రేషన్ రద్దు ప్రమోటర్లపై విచారణకు ఈడీకి ఆదేశం పెండింగ్ ప్రాజెక్టుల బాధ్యత ఎన్‌బీసీసీకి అప్పగింత 42 వేల మంది గృహ కొనుగోలుదారులకు ఊరట న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్

నష్టాల్లో మెటల్‌ షేర్లు..

Wednesday 24th July 2019

ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.27 సమయానికి 2.42 శాతం నష్టపోయి 2,711.60    పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.77 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.95 శాతం, సెయిల్‌ 3.47 శాతం, వేదాంత లి. 3.24 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.17 శాతం, టాటా స్టీల్‌ 2.44 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.31 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌

Most from this category