News


స్థిరంగా పసిడి

Monday 4th November 2019
Markets_main1572844708.png-29327

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,513 వద్ద కదలాడుతుంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరు దేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అక్టోబర్‌లో అంచనాలకు మించిన నమోదు కావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం పసిడి కొంత కొనుగోళ్ల మద్దతునిస్తుంది. స్వల్పకాలంలో పసిడి ధర 1,480–1,530 డాలర్ల శ్రేణిలో ట్రేడ్‌ అవ్వచ్చని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి కొత్తగా ఎన్నికైన క్రిస్టిన్ లగార్డ్ మొదటి ప్రసంగంపై పసిడి ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  క్రితం వారం పసిడి ధర 3.40డాలర్ల నష్టంతో 1,511.40 డాలర్ల వద్ద ముగిసింది. 
దేశీయ మార్కెట్లో రూ.100లు లాభం:- 
ఇక దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర రూ.100ల మేర లాభపడింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.100 లాభంతో రూ.38410 వద్ద స్థిరపడింది. దేశీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే రూపాయి విలువ 15పైసలు బలపడి 70.66 వద్ద ట్రేడ్‌ అవుతోంది. స్వల్పకాలంలో దేశీయ పసిడి ఫ్యూచర్‌ ధర పాజిటివ్‌గా ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉందని, రూ.38,600 స్థాయిని పరీక్షించవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్స్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 



You may be interested

ఏడాదిగా ఎంఎఫ్‌ల ఫేవరెట్‌ షేర్లివే!

Monday 4th November 2019

నాలుగు త్రైమాసికాలుగా వీటిలో వాటాలు పెంచుకుంటున్న ఫండ్స్‌ ఏడాది కాలంగా మార్కెట్లు పడుతూ లేస్తూ పయనం సాగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫండ్‌ మేనేజర్లు కొన్ని నాణ్యమైన స్టాకులను తమ పోర్టుఫోలియోల్లో పెంచుకుంటూ పోతున్నారు. వీటిలో నాణ్యమైన ఏడు స్టాకులను వివిధ పారామీటర్ల ఆధారంగా నిపుణులు ఎంపిక చేస్తున్నారు.  ఇలా ఎంఎఫ్‌లు ఏడాదిగా మక్కువ చూపుతున్న ఏడు స్టాకుల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎల్‌అండ్‌ టీ: బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తున్నా,

26 పైసలు బలపడిన రూపీ

Monday 4th November 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 26 పైసలు బలపడి రూ. 70.55 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 11 పైసలు బలపడి 70.81 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలున్నప్పటికి, యురోప్‌, యుఎస్‌ ఆర్థిక డేటా విడుదలవ్వడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా సోమవారం సెషన్లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Most from this category