News


ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 29th June 2019
Markets_main1561792011.png-26685

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ ముగిసింది. అమెరికా రాత్రి ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,413.79 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, జూలైలో ఫెడ్‌వడ్డీరేట్ల కోత అంచనాలపై ఆశాహనంతో పసిడి ధర 2016 తరువాత ఒకనెలలో అతిపెద్ద లాభాల్ని ఆర్జించింది. ఈ జూన్‌ నెలలో  ఆగస్టు పసిడి ఫ్యూచర్ల కాంట్రాక్టు ధర ఏకంగా 7.8శాతం ర్యాలీ చేశాయి.  బలమైన కన్జ్యూమర్‌ వినియోగ గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండటం, కోర్‌ పీసీఈ ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం అంశాల దృష్ట్యా వచ్చే నెలలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కచ్చితంగా ఉంటుందని నూటికి నూరు శాతం ట్రేడర్లు అంచనా వేస్తున్నారని ఇన్వెస్టిగేషన్‌ డామ్‌ కామ్‌ సర్వేలో వెల్లడైంది. స్థూల ఆర్థిక వ్యవస్థ రోజురోజూకూ క్షీణిస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా తమ పెట్టుబడులను పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తున్నారు. ఇప్పుడు పసిడి 1400డాలర్ల వద్ద కీలక మద్దతు ధరను ఏర్పాటు చేసుకుంది. వచ్చే ఏడాదిలో 1500 డాలర్ల స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో పసిడి ధర 17డాలర్లు లాభపడింది. 
దేశీయంగానూ అదే ధోరణి:- 
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌తో దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర ఫ్లాట్‌గా ముగిసింది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం రాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.31ల స్వల్పలాభంతో 34206.00 వద్ద స్ధిరపడింది. డాలర్‌ ఇండెక్స్‌ బలపడంతో నిన్నటి ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ మాకంలో రూపాయి విలువ 4 పైసల స్వల్పంగా బలపడి 69.03స్థాయి వద్ద ముగిసింది. ఈ వారంలో పసిడి ధర రూ.1161లు లాభపడింది.



You may be interested

రిలయన్స్‌ హోమ్స్‌ రూ.400కోట్ల చెల్లింపుల డీఫాల్ట్‌

Saturday 29th June 2019

అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ గ్రూప్‌ కంపెనీలకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. తాజాగా అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ హోమ్స్‌ సంస్థ శుక్రవారం నాన్‌ - కన్వర్టబుల్‌ డిబెంచర్లపై చెల్లించాల్సిన రూ.400 కోట్లను చెల్లించడంలో విఫలమైంది. అప్పులను చెల్లించడానికి జరుగుతున్న మోనటైజేషన్‌ ప్రక్రియ నుంచి రావాల్సిన ఆదాయం సరైన సమయంలో అందకపోవడంతో డిబెంచర్ల రుణాన్ని చెల్లించలేకపోయినట్లు శనివారం కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ మొత్తం రుణాన్ని చెల్లించేందుకు కంపెనీ

అమెరికా-చైనా మధ్య సంధి

Saturday 29th June 2019

గత కొన్ని రోజుల నుంచి అందరి దృష్ఠిని ఆకర్షిస్తున్న  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం సానుకూలంగా జరిగినట్టు తెలుస్తోంది. చైనాతో వాణిజ్య చర్చలు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాయని ట్రంప్‌ అనడం గమనార్హం. శనివారం జరిగిన ‘అద్భుతమైన’ చర్చల తర్వాత వాషింగ్టన్‌  చైనా ఉత్పత్తులపై విధించనున్న కొత్త సుంకాలను ఆపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  రెండు కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మధ్య  వాణిజ్య యుద్ధం

Most from this category