News


నెల గరిష్టానికి పసిడి

Tuesday 14th May 2019
Markets_main1557810778.png-25719

ప్రపంచమార్కెట్లో పసిడి ధర నెలరోజుల గరిష్టానికి చేరుకుంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదరడం, పశ్చిమ ఆసియా సముద్రజలాల్లో ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రికత్త వాతవరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. ఇందుకు కారణమైంది. ఆసియాలో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 1,301.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రస్తుతం విధిస్తున్న 10శాతం సుంకాన్ని 25శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే మరో రూ.21 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపైనా సుంకాన్ని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయమని అమెరికా వాణిజ్య అధికారులను ఆదేశించారు. దీనికి చైనా ఘాటుగానే  స్పందించింది. అమెరికా నుంచి తమ దేశానికి దిగుమతయ్యే 4.2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపై సుంకాలను 10శాతం నుంచి 25శాతానికి పెంచుతామని ప్రకటించింది. మరోవైపు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం గౌరవించబోమని గతవారంలో ఇరాన్ సృష్టం చేసింది. దీంతో అమెరికా పశ్చిమాసియా సముద్రజలాల్లో అమెరికా సైన్యాన్ని మోహరింపజేసింది. ఇది ముమ్మాటికి ఉద్రిక్త పరిస్థితులను కల్గించడమేనని ఇరాక్ కమాండర్ ఒకరు తెలిపారు. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, పశ్చిమాసియా సమద్రజలాల్లో ఇరాన్‌ - అమెరికాల మధ్య యుద్దవాతావరణం నెలకొనడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 14.40 డాలర్లు (1.1శాతం) ర్యాలీ చేసి 1,301 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 19 తరువాత ఒకేరోజులో పసిడి ఇంత స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల పతనం కొనసాగితే 1,310 - 1,312డాలర్ల శ్రేణిలో కదలాడుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశీయంగా రూ.100ల నష్టం:- 
ప్రపంచమార్కెట్లో పసిడి నెలరోజుల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.107ల నష్టంతో రూ.32391.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 59 పైసలు క్షీణించిన నేపథ్యంలో ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి రూ.505లు లాభపడి రూ.32,498లు లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు పసిడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వీకరణకు పూనుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. You may be interested

ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మార్పులు

Tuesday 14th May 2019

ఎంఎస్‌సీఐ తాజాగా తన ఇండియా ఇండెక్స్‌, ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల రివ్యూను పూర్తి చేసింది. రివ్యూలో భాగంగా కొన్ని మార్పులను చేపట్టింది. తాజా మార్పులు ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పులో భాగంగా ఎంఎస్‌సీఐ డొమెస్టిక్‌ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నుంచి కాడిలా హెల్త్‌కేర్‌ను తొలగించి, ఐసీఐసీఐ లుంబార్డ్‌కు స్థానం కల్పించింది. దీంతో పాటు కొత్తగా 14 స్టాకులను స్మాల్‌క్యాప్‌ సూచీకి కలిపింది. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, అబాట్‌

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 14th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు పీఎస్‌బీ ఇన్ఫ్రాటెక్‌:- తన అనుబంధ సంస్థ పీఎస్‌సీ హైవేస్‌కు కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను పెంచింది. కంపెనీ గల బ్యాంకు రుణ సౌకర్యాలను దృష్టి ఉంచుకుని రేటింగ్‌ను ‘‘ఎ(-)’’ నుంచి ‘‘ఎ’’ కు రేటింగ్‌ను పెంచుతున్నట్లు రేటింగ్‌ సం‍స్థ తెలిపింది.  అవధ్‌ షుగర్స్‌:-  1:1 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌:-  ప్రతి ఈక్విటీ షేరుకు రూ.5ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-

Most from this category