వారం కనిష్టానికి పసిడి
By Sakshi

అమెరికా చైనాల దేశాధ్యక్షులు మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలపడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం సెషన్లో వారం కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా పటిష్టమైన ఆర్థిక గణాంకాలను వెలువరించడంతో డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్ ఔన్స్ పసిడి ధర 1,460.60 డాలర్ల వద్ద వారం రోజుల కనిష్టాన్ని తాకింది. ఆశావహ వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడుదారులన్ని తమ ఈక్విటీ మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ తగ్గుతోందని బులియన్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగానూ స్వల్ప నష్టాల్లోనే:-
ఇక దేశీయంగా పసిడి ధర స్వల్పంగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.75ల నష్టంతో రూ.37820.00 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వారంలోనూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి భారీగా బలపడే అవకాశాలు లేవు. కావున ధీర్ఘకాలికానికి పసిడి పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చని పసిడి పండితులు సలహానిస్తున్నారు.
You may be interested
పేటిఎం అతి పెద్ద నిధుల సమీకరణ!
Monday 25th November 2019దేశీయ చెల్లింపుల కంపెనీ పేటిఎం తాజాగా 1 బిలియన్ డాలర్ల నిధులను ఫైనాన్సింగ్ రౌండ్ ద్వారా సమీకరించింది. ఈ ఫైనాన్సింగ్ రౌండ్ యుఎస్ ఆస్తి నిర్వహణ సంస్థ టీ రోవ్ ఫ్రైస్ నేతృత్వంలో జరగగా, కంపెనీ ఇన్వెస్టర్లయిన యాంట్ ఫైనాన్సియల్, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ కూడా పాల్గొన్నాయి. ఈ ఏడాది ఇండియన్ స్టార్టప్ కంపెనీలో జరిగిన అతి పెద్ద నిధుల సమీకరణ ఇదేనని కంపెనీ తెలిపింది. దీంతో కంపెనీ
11850 కాపాడుకుంటే ఆల్‌టైమ్ హైకి...
Monday 25th November 2019నిఫ్టీపై నిపుణుల అంచనాలు నిఫ్టీ 11850 పాయింట్ల మద్దతు జోన్‌ను కోల్పోకుండా కాపాడుకుంటే క్రమంగా అప్‌మూవ్ కొనసాగి మరోమారు లైఫ్టైమ్హైని తాకవచ్చని మార్కెట్ నిపుణుడు చందన్ తపారియా అభిప్రాయపడ్డారు. 16 సెషన్లుగా నిఫ్టీ 11800- 12038 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. చార్టుల్లో బుల్స్, బేర్స్ మధ్య హోరా హోరీ కనిపిస్తోంది. నిఫ్టీ ప్రధాన మద్దతుపైన స్థిరంగా ఉంటే రాబోయే సెషన్లలో 12035, 12103 పాయింట్లను చేరుతుందని చందన్ చెప్పారు. బ్యాంకు నిఫ్టీ