News


కోవిడ్‌ భయం... పసిడి పరుగు

Thursday 20th February 2020
Markets_main1582167508.png-31944

  • అంతర్జాతీయంగా సరికొత్త గరిష్టస్థాయి
  • ఔన్స్‌ 1,614 డాలర్లపైకి అప్‌
  • ఏడేళ్ల గరిష్ట స్థాయి

న్యూయార్క్‌: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ వార్త రాసే 10 గంటల సమయంలో 1,607 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా భయాలతో వృద్ధి ప్రపంచ వృద్ధిరేటు పడిపోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వస్తున్న వార్తలు కూడా పసిడికి బలంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఏడాదిలో పసిడి ధర 21 శాతం (1,277.9 డాలర్లు కనిష్టం) పెరిగింది. 

దేశీయంగానూ పరుగే...
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, పెళ్లిళ్ల సీజన్‌ దేశంలో పసిడి ధరను పెంచుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి కూడా పసిడికి బలమవుతోంది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర లాభాల్లో రూ.41,470 వద్ద ట్రేడవుతోంది. ముంబై స్పాట్‌ మార్కెట్‌లో పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర బుధవారం రూ.42,110 పలికింది.  



You may be interested

భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం ఉండకపోవచ్చు

Thursday 20th February 2020

(అప్‌డేటెడ్‌...)  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన వాషింగ్టన్‌: వాణిజ్యం విషయంలో భారత్‌ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్‌ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య

ఏపీలో రూ.300 కోట్లతో మెడికవర్‌ విస్తరణ

Thursday 20th February 2020

కంపెనీ పరమైన సింహపురి హాస్పిటల్స్‌ వైజాగ్‌, శ్రీకాకుళంలో కొత్తగా ఆసుపత్రులు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పోలాండ్‌కు చెందిన మెడికవర్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తాజాగా నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిని కొనుగోలు చేసింది. 250 పడకల సామర్థ్యమున్న ఈ కేంద్రం కోసం సంస్థ రూ.150 కోట్లదాకా వెచ్చించింది. దీనిని 750 పడకల స్థాయికి చేర్చనున్నారు. మెడికవర్‌గా పేరు మారిన ఈ ఆసుపత్రిని సంస్థ బుధవారం ఆవిష్కరించింది. ఇక్కడే క్యాన్సర్‌

Most from this category