News


ఆకాశాన్నంటిన బంగారం ధర

Monday 6th January 2020
Markets_main1578288072.png-30700

  • రెండురోజుల్లో రూ.1800లు పెరిగిన బంగారం
  • కలిసొచ్చిన ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలు 

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర సోమవారం మరోసారి ఆకాశానికి ఎగసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ఉదయం సెషన్‌లో ఏకంగా రూ.984లు లాభపడింది. ఉదయం గం.10:15ని.లకు రూ.890ల లాభంతో రూ.41012 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 36డాలర్లు ర్యాలీ చేసి ఏడేళ్ల గరిష్టాన్ని అందుకోవడం, బ్యారెల్‌ ముడిచమురు ధర 70డాలర్లను తాకడం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి 29 పైసలు బలపడటం తదితర అంశాలు బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌ను పెంచాయి. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి రూ. 835లు బలపడి రూ.40,112 వద్ద స్థిరపడింది. ఈ రెండు ట్రెడింగ్‌ సెషన్స్‌లో బంగారం ధర రూ.1800లు లాభపడింది. ఇరాన్‌-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర నేడు 36డాలర్లు లాభపడి 1,588 డాలర్లకు చేరింది. ఈ ధర బంగారానికి ఏడేళ్ల గరిష్టస్థాయి కావడం విశేషం.

‘‘ భౌగోళిక రాజకీయ ఆందోళనలు మరింత ఉదృతం కానున్న నేపథ్యంలో బంగారానికి మరింత డిమాండ్‌ నెలకొంటుంది. బంగారం కొనుగోళ్ల ఆస్తకి కలిగిన ఇన్వెస్టర్లు రూ.42వేల టార్గెట్‌తో పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల చేయడం ఉత్తమం’’ అని బులియన్‌ పండితులు సలహానిస్తున్నారు. 

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించడంత, అమెరికా తయారీ రంగ పీఎంఐ గణాంకాలు బంగారం ర్యాలీకి తోడ్పాటునిస్తాయి. ఇక దేశీయంగా స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు, రూపాయి బలహీనతలు పసిడికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని ఇండియానివేశ్‌ కమోడిటీ డెరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. You may be interested

యాంఫీ రీజిగ్‌- ఈ మిడ్‌ క్యాప్స్‌ దారెటు?

Monday 6th January 2020

ఇన్ఫో ఎడ్జ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కన్సాయ్‌ నెరోలాక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ యస్‌ బ్యాంక్‌, కేడిలా హెల్త్‌కేర్‌ ఐబీ హౌసింగ్‌, వొడాఫోన్‌ ఐడియా దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ) తాజాగా మిడ్‌ క్యాప్‌ విభాగంలో కొన్ని మార్పులు చేపట్టింది. దీంతో లిస్టెడ్‌ మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొన్ని లార్జ్‌ క్యాప్‌ విభాగంలోకి చేరనుండగా.. మరికొన్ని లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌గా అవతరించనున్నాయి. దీంతో దేశీయంగా మ్యూచువల్‌ ఫం‍డ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడుల ప్రాధాన్యతలో ఇకపై కీలకమైన మార్పులు

జనవరి సీరిస్‌లో ఓఐ పెరిగిన స్టాకులివే!

Monday 6th January 2020

గత సీరిస్‌తో పోలిస్తే జనవరి డెరివేటివ్‌ సీరిస్‌లో ఓపెన్‌ఇంట్రెస్ట్‌(ఓఐ)లో భారీ మార్పులు వచ్చిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... 1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 35.8 శాతం, షేరు ధర 5.4 శాతం పెరిగింది. ఫుడ్‌టెక్‌ యాప్స్‌ నుంచి పోటీ తగ్గుతోంది. ఈ యాప్స్‌కు రెస్టారెంట్ల డీలిస్టింగ్‌తో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే కమీషన్ల విషయంలో కూడా పొసగడం లేదు. దీంతో వీటి నుంచి కంపెనీకి పోటీ తగ్గింది. ఇది

Most from this category