News


రూ.41,000 దాటిన పసిడి

Saturday 1st February 2020
Markets_main1580532527.png-31389


కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చైనాలోనేగాక ఇతర దేశాల్లో కూడా వైరస్‌ కేసులు నమోదవుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులవైపు ఆసక్తి కనబరుస్తుండడంతో బంగారం ధర రూ.41,000పైకి చేరింది. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ.700 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 41,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,589 డాలర్ల వద్ద ముగిసింది. 


(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

వేదాంత లాభం 49 శాతం అప్‌

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: వేదాంత కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 49 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,574 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.2,348 కోట్లకు పెరిగిందని వేదాంత కంపెనీ సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ వెల్లడించారు. ఆదాయం మాత్రం రూ.25,067 కోట్ల నుంచి రూ.22,007 కోట్లకు తగ్గిందని తెలిపారు. వ్యయాలు కూడా రూ.21,589 కోట్ల నుంచి రూ.18,369 కోట్లకు

బడ్జెట్‌ రోజున నష్టాలతో ప్రారంభం

Saturday 1st February 2020

బడ్జెట్‌ సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత 11900 దిగువున ప్రారంభం 50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ బడ్జెట్‌ రోజున జరిగే ప్రత్యేక ట్రేడింగ్‌ సందర్భంగా శనివారం దేశీయ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు నష్టంతో 40673.49 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 11,939.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవుదినం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండంతో స్టాక్‌ ఎక్చ్సేంజీలు పని చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు పూనుకున్నారు. అంతర్జాతీయంగానూ

Most from this category