News


మూడోరోజూ పెరిగిన పసిడి

Friday 17th January 2020
Markets_main1579241937.png-30989

  • కలిసొచ్చిన రూపాయి బలహీనత 

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర వరుసగా మూడోరోజూ లాభపడింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.39790 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు నష్టంతో బంగారానికి కలిసొచ్చింది. మిశ్రమ ఫండమెంటల్స్‌ కారణంగా స్వల్పకాలానికి బంగారం అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని రూ.39600స్థాయి వద్ద కీలక మద్దతు ధరను, రూ.39,800 నిరోధస్థాయిని ఏర్పాటు చేసుకున్నట్లు ఎంస్‌ఎంసీ గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.75లు లాభపడి రూ.39,686 వద్ద స్థిరపడింది. 
అంతర్జాతీయ మార్కెట్లో 7డాలర్లు అప్‌:- 
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద అమలుపై సందేహాలు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో నేడు పసిడి ప్యూచర్లు 7డాలర్లు బలపడింది. చైనా జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పడిపోవడంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు సైతం బంగారానికి డిమాండ్‌ను పెంచారు. ఫలితంగా నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు లాభపడి 1,557.05డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాదిన్నరగా అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని పరిష్కారించుకునే దిశగా బుధవారం ఇరు దేశాలు మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే, అమెరికా చైనా స్నేహపూర్వక సంబంధం ఎంతకాలం కొనసాగుతుందనే సందేహాలు మార్కెట్‌ వర్గాలను ఇంకా వెంటాడుతున్నాయి.  



You may be interested

శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 17th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు  భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా:- టెలికం సంస్థలు దాఖలు చేసిన ఏజీఆర్‌ సమీక్షా పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.  యస్‌ బ్యాంక్‌:-  యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను మూడీస్‌ సమీక్షలో ఉంచింది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌:- మూడో త్రైమాసిక నికరలాభం 8 శాతం పెరిగి రూ.90.5 కోట్లకు చేరింది. ఎన్‌ఐఐ 15.6 శాతం పెరిగి రూ.601.8   కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయి(ఎన్‌పీఏ)లు 4 బేసిస్‌పాయింట్లు

ర్యాలీస్‌.. క్యూ3 జోష్‌- యస్‌ బ్యాంక్‌.. ఏజీఆర్‌ షాక్‌

Friday 17th January 2020

టాటా గ్రూప్‌ ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ ర్యాలీస్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో భారీ లాభాలతో కళకళలాడుతోంది. అయితే మరోపక్క ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో టెలికం రుణాలు మొండిబకాయిలుగా మారే

Most from this category