News


మెరిసిన బంగారం

Tuesday 25th February 2020
Markets_main1582599267.png-32056

  • అంతర్జాతీయంగా 1,700 డాలర్లకు చేరిక
  • దేశీయంగానూ పరుగే 
  • రూ.1000 వరకూ లాభం
  • కరోనా భయాలు ప్రధాన కారణం
  • రూపాయి పతనమూ కారణమే!

ముంబై: చైనాలో మొదలై ప్రపంచ దేశాలను విస్తరిస్తూ పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం,  ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి వేగంగా పెట్టుబడులు పసిడివైపు మరళుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్స్చేంజ్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర సోమవారం ఏకంగా దాదాపు 42 డాలర్లు ఎగసింది. ట్రేడింగ్‌ ఒక దశలో 1,700 డాలర్లకు 10 డాలర్ల దూరంలో 1,691.56ను తాకింది. ఈ వార్తరాసే రాత్రి 9 గంటల సమయంలో 31.35 డాలర్ల లాభంతో 1,680.15 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర దాదాపు 8 సంవత్సరాల గరిష్టస్థాయి. 

దేశీయంగా రూపాయి బలహీనత తోడు...
ఇక భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణితోపాటు, దేశీయంగా రూపాయి బలహీనత పసిడి పరుగుకు కారణమవుతోంది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర ఈ వార్త రాసే 9 గంటల సమయంలో రూ.953 లాభంతో రూ.43,619 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఒక దశలో రూ.43,788 డాలర్లనూ తాకింది. ఢిల్లీ సహా పలు పట్టణాల్లోని స్పాట్‌ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.1,000 వరకూ పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాములు స్వచ్ఛత పసిడి ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. పలు పట్టణాల స్పాట్‌ మార్కెట్లలోనూ ధర దాదాపు రూ.1,000 వరకూ పెరిగి రూ.44,000 పైనే ధర పలికింది. 



You may be interested

రూపాయి.. మూడు నెలల కనిష్టం!

Tuesday 25th February 2020

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 34 పైసలు పడిపోయింది. 71.98 వద్ద ముగిసింది. గడచిన మూడు నెలల్లో ఈ స్థాయికి (నవంబర్‌ 13 తర్వాత) రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీల భారీ పతనం, విదేశీ మార్కెట్లలో అమెరికా కరెన్సీకి డిమాండ్‌ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణంగా ఉన్నాయి. 71.94 వద్ద ప్రారంభమైన రూపాయి ఒకదశలో 72.01ని కూడా

సొంత సాంకేతిక సామర్ధ్యాలను పెంచుకోవాలి

Tuesday 25th February 2020

సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి దేశీ సంస్థలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచన ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్‌ ద్వారా స్మార్ట్‌ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్‌ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల

Most from this category